ప్రసంగాలు
37
కాబట్టి, మనస్సుని సమస్తమైన ఆధిపత్యాన్నుండి విడుదల చేయాలంటే తనంటే ఏమిటో తెలుసుకోవాలి. అంటే స్వీయజ్ఞానం. నేను చెప్తున్నది వున్నతంగా వుండే మరో జీవుడు లేదా ఆత్మని గురించి కాదు. అవన్నీ మనసు చేసిన కల్పనలు, ఆలోచన చేసిన కల్పనలు, భయంలో నుండి పుట్టుకొచ్చిన కల్పనలు. మనం మాట్లాడుకుంటున్నది స్వీయం జ్ఞానం గురించి; అంటే తను యదార్ధంగా ఏమిటో ఆ తనని తెలుసుకోవడం; తను ఎట్లా వుండాలి అనేది కాదు. తను బుద్ధి హీనుణ్ణని, తను భయపడుతున్నానని, తనకు చాలా ఆకాంక్షలున్నాయని, తను చాలా క్రూరుడినని, తనలో దౌర్జన్యం వున్నదని, అత్యాశ వున్నదని గ్రహించడం; తన ఆలోచనల వెనకాల వున్న వుద్దేశ్యాలు, తన చర్యల వెనకాల వున్న వుద్దేశ్యాలు గ్రహించడం. తనని తాను తెలుసుకోవడం ఆవిధంగా ఆరంభమవుతుంది. మీరు ఏమిటో మీకు తెలియకపోతే, మీ మానసిక ప్రక్రియలన్నీ ఎట్లా పనిచేస్తుంటాయో, మీరు ఎట్లా అనుభూతి చెందుతున్నారో, మీరు ఏమీ ఆలోచిస్తున్నారో, మీ వుద్దేశ్యాలు ఏమీటో, కొన్ని పనులు మీరు ఎందుకు చేస్తారో, కొన్ని ఎందుకు చేయకుండా తప్పించుకుంటారో, సుఖం కోసం, సంతోషం కోసం మీరు పడే ఆరాటం- యిదంతా కనుక ముఖ్యంగా మీరు తెలుసుకోకపోతే మిమ్మల్ని మీరే మోసం చేసుకునే అవకాశం వుంది; మీకే కాదు, యితరులకి కూడా విపరీతమైన కీడు చేసే ప్రమాదం వుంది. ఈ ప్రాధమికమైన స్వీయజ్ఞానం కనుక లేకపోతే, ధ్యానం అనేదానికి ఆస్కారం లేదు. దానిని గురించి యిప్పుడు మాట్లాడబోతున్నాను.
చూడండి, ప్రపంచమంతటా యువతీయువకులు, పాతుకొనిపోయిన యీ వ్యవస్థను ప్రపంచాన్ని వికృతం గాను, ఘోరంగాను, అల్లకల్లోలంగాను తయారుచేసిన యీ వ్యవస్థను- త్రోసి పుచ్చుతున్నారు, దానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. ఎన్నో యుద్ధాలు జరిగినై. ఒక్క వుద్యోగం కోసం వేలమంది పోటీపడుతున్నారు. పాత తరానికి చెందినవాళ్ళు తమ ఆకాంక్షలు, తమ దురాశ, దౌర్జన్యం, తమ సిద్దాంతాలు ఆధారం చేసుకొని సమాజాన్ని నిర్మించారు. ఇప్పటి తరంవారు, ముఖ్యంగా యువత, సిద్దాంతాలన్నింటినీ త్రోసి అవతల పడేస్తున్నారు. బహుశ యీ దేశంలో అది జరగడం లేదేమో; ఎందుకంటే మనం యింకా అంత ఆధునాతనం అవలేదు, యింకా అంత నాగరీకం చెందలేదు, ఆధిపత్యాన్నంతటినీ త్రోసిపుచ్చేంతగా, అయితే, యీ సిద్ధాంతాలను తిరస్కరించిన వాళ్ళు మళ్ళీ తన కొత్త సిద్ధాంతాలతో యింకో పద్దతిని సృష్టిస్తున్నారు. పొడుగ్గా జుట్టు పెంచుకోవడం యింకా అటువంటివే మరికొన్నింటిని.
కాబట్టి, తిరుగుబాటు , చేయడంతో సమస్య పరిష్కారం కాదు. సమస్యకు సమాధానం ఏమిటంటే మనలోపల క్రమశీలతను తీసుకొనిరావడం- సజీవంగా వుండే