Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

కృష్ణమూర్తి

తత్వం చేస్తాయి. మీ మీ సంస్కృతులు మిమ్మల్ని నిబద్ధీకృతులని చేస్తాయి; ఆ నేపధ్యమే మీ రకరకాల అనుభవాలను చిత్రిస్తుంది. మీ సామర్థ్యం, చాతుర్యం వుపయోగించి మీరు ఆ అనుభవాలకు వ్యాఖ్యానాలు కల్పించి చెబుతూ వుంటారు. పదిమందీ మిమ్మల్ని గౌరవిస్తూ వుంటారు. దీనితో పాటుగా వుండే ఆ తమాషా, అదంతా మీకు తెలుసు.

కాబట్టి, యింకొకరి అనుభవాన్నే కాకుండా, మన అనుభవాన్ని కూడా మనం ప్రశ్నించాలి, సందేహించాలి. చేతన సీమను విస్తృతం చేసుకోవడం కోసం కొత్త కొత్త అనుభవాలను వెతుక్కోవడం వివిధ రూపాల్లో వున్న మాదకద్రవ్యాల వాడకం ద్వారా యిది జరుగుతున్నది. ఇదంతా కూడా చేతనావర్తం లోపలనే జరుగుతుంది, కాబట్టి యిదంతా పరిమితులకు లోబడినదే. అందుకని, ఏ రకమైన అనుభవం కోసం అయినా-ముఖ్యంగా మతసంబంధమైనది అనీ, ఆధ్యాత్మిక సంబంధమైనది అనీ చెప్పుకొనేదాని కోసం- అన్వేషించేవారు ఆ అనుభవాన్ని ప్రశ్నించాలి, సందేహించాలి, అంతేకాకుండా దానిని పూర్తిగా త్రోసి పారేయాలి. చాలా స్పష్టంగా వున్న మనసుకు, సావధాన శీలత్వంతోను, ప్రేమతోను నిండివున్న మనసుకు యింకా ఏవో అనుభవాలు కావాలనే ఆరాటం ఎందుకుంటుంది?

సత్యం అనేదానిని రారమ్మని మనం పిలవలేము. రకరకాల పూజా ప్రార్ధనలు, ప్రాణాయామం, ఒక పరమసత్యాన్నీ, ఒక అనుభూతిని కనిపెట్టడం కోసం మనుష్యులు చేసే యింకా ఎన్నో గారడీలు- యివన్నీ ఎంతయినా మీరు నిత్యం అభ్యాసం చేస్తూ వుండండి. కానీ, సత్యాన్ని మాత్రం యీ విధంగా పిలిచి రప్పించలేరు. కొలతలకు లోబడినది రావచ్చేమో తప్ప, కొలతలకు అందని, ప్రమేయమైనది కాదు. నిబద్ధీకరణం చెందిన మనసుతో అవగాహన చేసుకోలేని ఆ సత్యాన్ని వెంటాడుతున్న వ్యక్తి బాహ్యంగానే కాకుండా, అంతర్గతంగా కూడా అస్తవ్యస్తతను పెంచిపోషిస్తాడు.

కాబట్టి ఆధిపత్యాన్ని పూర్తిగా త్రోసిరాజనవలసిందే. అయితే, అది చాలా కష్టసాధ్యమైన కార్యం. చిన్నతనం నుంచీ ఏదో ఒక ఆధిపత్యం మన మీద పెత్తనం చేస్తూ వస్తుంది. కుటుంబం, తల్లి దండ్రీ, పారశాల, అధ్యాపకుడు మొదలైనవారి ఆధిపత్యంలోనే మనం నడిచాం. శాస్త్రవేత్తలు, సాంకేతిక వైజ్ఞానికుడికీ తప్పకుండా ఆయా రంగాల్లో ఆధిపత్యం వుంటుంది. కానీ, ఆధ్యాత్మికమైన ఆధిపత్యం అనబడేది మాత్రం మహా దుర్మార్గమైనది. అదే క్రమరాహిత్యానికి గల ప్రధానకారణాల్లో ఒకటి. ఎందుకంటే అది ప్రపంచాన్ని రకరకాలైన మతాలుగాను, రకరకాలైన సిద్దాంతాలుగాను విభజించింది,