34
కృష్ణమూర్తి తత్వం
వున్నాయి. ఇవన్నీ నిజంగా చూస్తే కాన్ సెంట్రేషన్ కేంపులు, అంటే మారణ శిబిరాలు. ఎందుకంటే అక్కడ మీరు చేయవలసినవాటి గురించి వాళ్ళు చాలా నిష్కర్షగా వుంటారు. ఆధ్యాత్మిక ఆచార్యులని అంటారే, వారిదే అక్కడ సర్వాధిపత్యం. తక్కిన కాన్ సెంట్రేషన్ కేంపుల్లోలాగే యిక్కడా మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూస్తారు. మిమ్మల్ని ఒక కొత్త చట్రంలో బిగించాలని ప్రయత్నిస్తారు. అభిప్రాయాలను మార్చడానికి, ఆలోచనా వైఖరిని మార్చడానికి, మనుష్యుల మీద ఒత్తిడి ప్రయోగించడానికీ రష్యాలోని కమ్యునిస్టులు, నియంతృత్వ ప్రభుత్వాలు కాన్ సెంట్రేషన్ కేంపులు (మారణ శిబిరాలు) నిర్మించాయి. సరిగ్గా అదే యిక్కడ కూడా జరుగుతున్నది. ప్రపంచంలో అల్లకల్లోలం ఎక్కువవుతున్న కొద్దీ ఆశ్రమాలు అనబడేవి కూడా ఎక్కువవుతుస్నాయి. ఇవి మీకొక అద్భుతమైన భవిష్యత్తుని ప్రసాదిస్తామని నమ్మిస్తూ, మనుష్యులని పూర్తిగా వక్రంగా తయారు చేయడానికి, ఒకే నమూనాలో అచ్చుపోయడానికి, ఒక ప్రత్యేకమైన వరవడిలోకి వారిని నిర్బంధించడానికి ప్రయత్నిస్తున్న కాన్సంట్రేషన్ కేంపులు. మూర్ఖులు యిదంతా నమ్ముతారు. తమకు భౌతికమైన భద్రత లభిస్తుంది కాబట్టి వీటన్నింటికీ అంగీకరిస్తారు. అక్కడి సర్వాధికారి, నియమ సూత్రాల బోధకుడు, గురువు ఏం చేస్తే మీరు ఖచ్చితంగా అదే చేయాలి. అయితే, యివన్నీ అందరూ ఎంత యిష్ట పూర్వకంగానే చేస్తుంటారు. ఎందుకంటే దీని ద్వారా స్వర్గమో, ఏదో ప్రాప్తిస్తుందనీ యీ లోపల యిక్కడి భౌతికమైన రక్షణ లభిస్తుందనీ, ఈ విధమైన యాంత్రిక విధేయత. అసలు విధేయత అంటేనే యాంత్రికం- విపరీతమైన అస్తవ్యస్తతను పెంచి పోషిస్తుంది. చరిత్ర పుటలు తిరగేసినా, జీవితంలో ప్రతినిత్యం జరుగుతున్న సంఘటనలు గమనించినా యిది మనం గ్రహించవచ్చు.
అందుకని, అస్తవ్యస్తత అంటే ఏమిటో తేట తెల్లంగా తెలుసుకోవాలంటే అస్తవ్యస్తతకు గల కారణాలేమిటో అవగాహన చేసుకోవాలి. ఇంకొకరెవరో విశ్వాస భరితంగా చెప్పిన మాటలు నమ్మి పరమసత్యాన్ని సాధించాలని పూనుకోవడమూ, అన్వేషించ బూనడమూ అస్తవ్యస్తస్థితికి గల ప్రధానకారణం. మనలో చాలామంది గందరగోళపు స్థితిలో వున్నారు కాబట్టి, మనలో చాలా మంది విపరీతమైన ఆందోళనలో వున్నారు కాబట్టి, సౌఖ్యవంతమైన ఆధ్యాత్మిక జీవనాన్ని యిస్తాము, అని ఎవరైనా నమ్మకంగా చేస్తే, వారిని అనుసరించడానికి తయారవుతాం. ఇది చాలా విచిత్రమైన విషయం- రాజకీయాల్లో నిరంకుశత్వాన్నీ, నియంతృత్వాన్ని మనం వ్యతిరేకిస్తాం. అభ్యుదయ దృక్పధమూ, నాగరికతా ఎక్కువైన కొద్దీ, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఎక్కువైనకొద్దీ, రాజకీయ, ఆర్ధిక రంగాలలో నిరంకుశత్వాన్నీ, నియంతృత్వాన్నీ నిరసించడం, ద్వేషించడం ఎక్కువవుతూవుంటుంది. అయితే, అంతర్గతంగా మరొకరి