Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసంగాలు

25

ఆలోచన ఆ వ్యక్తిని గురించి తయారుచేసిన కాల్పనిక రూపాన్ని మీరు చూస్తుంటారు. కాబట్టి నూతనమైనదాన్ని మీరు చూడటం వుండనే వుండదు. ఆలోచనను సుఖం అదుపు ఆజ్ఞల్లో పెడ్తూవుంటుంది. అసలు సుఖసంతోషాలనే సూత్రమే మనల్ని నడిపిస్తూ వుంటుంది. దీనిని గురించి క్రిందటిసారి మనం కొంత మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ప్రశ్నిస్తున్నది ఏమిటంటే యీ పరిమితులుగల చేతనావర్తాన్ని దాటుకొని ఆవలగా వెళ్ళడం అనేది సాధ్యమేనా అని. ఆలోచనను గురించి విచారణ చేయడం ధ్యానంలో ఒక భాగం. దీనికి అపారమైన క్రమ శిక్షణ వుండవలసిన ఆవశ్యకత వుంది. ఈ క్రమశిక్షణ అంటే అదుపు, అణచివేత, అనుకరణ, ఒక పద్ధతిని అనుసరించడం మొదలైన అర్ధంలేని వేషాలతో కూడిన క్రమ శిక్షణ కానేకాదు.

ఇప్పుడు, విచారణ అనే యీ ప్రక్రియ ఏమిటో తెలుసుకుందాం. ఈ వక్త దీనిని పరిశీలించ బోతున్నాడు; మీరు కూడా యీ వక్తతో పాటు ప్రయాణించ దలచుకుంటే, అతను చెప్పేదానిని సావధానంగా వినడమే కాకుండా, అతనితోపాటు మీరు కూడా అందుకునే ప్రయత్నం చేయాలి, కేవలం మాటల రూపంలో కాదు, యదార్ధంగా.

అమాయకత అనే రంగం వున్నదా, ఆలోచనచేత ఏ మాత్రం స్పృశింపబడని సహజస్వచ్ఛత్వం వుందా అని మనం కనిపెట్టబోతున్నాం. ఆ చెట్టువైపు యిదే ప్రప్రధమంగా చూడటం అన్నట్లుగా చూడగలనా; లోకం వైపు- గందరగోళం, బాధలు, దుఃఖం, మోసాలు, అమానుషత్వం, కపటం, క్రూరత్వం, యుద్ధాలతో కూడినటువంటి లోకంవైపు- లోకం అంటే మనకున్న సమస్త భావనాజాలంవైపు, అదే ప్రప్రధమంగా చూడటం అన్నట్లుగా చూడగలనా? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే, నేను కనుక అదే ప్రప్రధమంగా చూడటం అన్నట్లుగా చూడగలిగితే, నా చర్య పూర్తిగా నూతనంగా వుంటుంది. కాబట్టి మనసు యీ అమాయక స్వచ్ఛత్వం అనే రంగాన్నీ కనుక ఆవిష్కరించుకోకపోతే, అది ఏం చేసిన సరే- సాంఘిక సంస్కరణలు ఎన్ని చేసినా, ఎన్ని కార్యకలాపాలు నిర్వహించినా- ఆలోచన మనసును కలుషితం చేస్తూనే వుండిపోతుంది. ఎందుకంటే మనసును తయారుచేసింది ఆలోచనే. ఆలోచన ఎప్పటికీ పాతదే.

మేము ప్రశ్నిస్తున్నది ఏమిటంటే చేతనావర్తానికి పరిధులున్నాయి కాబట్టి, యీ చేతనలో కలిగే ఏ కదలిక అయినో ఆలోచసయొక్క కదలికేనా అని; అది చేతనంలో కానివ్వండి, అంతఃచేతనలో కానివ్వండి. దేవుడిని, సత్యాన్ని మీరు అన్వేషిస్తుంటే, అది ఆలోచన చేసే అన్వేషణే కదా; కాబట్టి తనకు తెలిసిన దానిని ఫలానా అని గుర్తించడానికి అనువుగా పైకి తీసి ప్రదర్శించడమే ఆలోచన చేసే