Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

కృష్ణమూర్తి తత్వం

వుండటం కారణంగా యీ అస్తవ్యస్తత ఏర్పడింది. అంటే ఆర్జనపరత్వంతో జీవితాన్ని ముడిపెట్టి చూసే వైఖరీ, పోటీ తత్వమూ, విధేయతా, ఆధిపత్యమూ అనే వాటి మీద యీ సమాజాన్ని నిర్మించారు; కాబట్టి అస్తవ్యస్తత నెలకొన్నది. ప్రతి మనిషి పాటు పడుతున్నది తన స్వంతం కోసమే. పారమార్ధికుడు పని చేస్తున్నదీ స్వార్ధం కోసమే! 'దేశ క్షేమం కొరకు' అని వుపన్యాసాలు చేస్తున్నా, రాజకీయ వేత్త పనిచేస్తున్నదీ స్వార్ధం కోసమే. వ్యాపారస్థుడి దృష్టి స్వలాభం పైనే, ప్రతి మనిషి తన స్వప్రయోజనం కోసమే పొటుపడుతున్నాడు. అందులో సందేహం లేదు. కాబట్టి అతడు అస్తవ్యస్తతను సృష్టిస్తున్నాడు. కొందరు ఆదర్శవాదులున్నారు; ప్రతి మనిషి తన కోసమే తను శ్రమ పడుతున్నాడు కాబట్టి, ఆదర్శజీవి తన దేశంకోసం, తన సమాజంకోసం, తన వర్గంకోసం, యింకా అట్లాంటివాటి కోసం పాటుపడాలని వాళ్ళు అంటున్నారు. అంటే అప్పుడు క్రమతను మనమీద బలవంతంగా రుద్దుతారనమాట. అప్పుడూ అస్తవ్యస్తత కలుగుతుంది. చారిత్రకంగా చూస్తే యిదంతా చాలావరకు నిజమే. కాబట్టి అస్తవ్యస్త స్థితిని- ప్రతి మనిషి అస్తవ్యస్తతను ఎట్లా సృష్టిస్తున్నాడు అనేదానిని అవగాహన చేసుకోవడం వల్ల, మేధాపరంగా కాదు, మాటల్లో కాదు, మనిషి ఏంచేస్తున్నాడు అనే వాస్తవాన్ని చూడటంవల్ల, ఆ గ్రహింపు ద్వారా నిజంగా 'ఉన్నది' ని పరిశీలించడం ద్వారా, యిదంతా అవగాహన చేసుకోవడం ద్వారా ఒక క్రమశిక్షణ కలుగుతుంది. ఆ క్రమశిక్షణ క్రమతను తీసుకొస్తుంది.

కాబట్టి, 'స్వేచ్చ' అనే మాటను 'అవగాహన' అనే మాటను, అంతేకాకుండా 'చూడటం' అనే మాటను కూడా మనం అర్ధం చేసుకోవాలి, ఆకళింపు చేసుకోవాలి. ఒక వస్తువునీ మనం చూస్తామా లేదూ దానిని గురించి మనకి వున్న మనో రూపం ద్వారా చూస్తామా? ఒక చెట్టుని చూసినప్పుడు, చెట్టుని గురించి మీకు వున్న ఒక మనోబింబం ద్వారా అసలు వాస్తవంలో వున్న చెట్టుని చూస్తున్నారన్నమాట. దయచేసి యిది మీరే పరిశీలించండి, మిమ్మల్ని మీరే జాగ్రత్తగా గమనించుకోండి. చెట్టువైపు మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడే మనం మాట్లాడుతుండగానే చూడండి. ఆలోచనతోపాటు దానీవైపు చూస్తారు. 'అది తాడిజాతి చెట్టు; దీని పేరు యిది, దాని పేరు అది' అని అంటారు. ఆలోచన అనేది చెట్టు అనే నిజమైన వాస్తవాన్ని పరికించకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది. మరికొంచెం మనోగతంగా, మరికాస్త అంతర్ముఖంగా వెళ్ళండి. మీ భర్తవైపో, భార్యవైపో మీరు చూస్తున్నప్పుడు, ఆ వ్యక్తిని గురించి మీరు ఏర్పరచుకొన్న ఒక కాల్పనిక బింబం ద్వారా చూడటం వుంటుంది నిస్సందేహంగా. ఎందుకంటే అతనితో కాని, ఆమెతో కాని మీరు అనేక సంవత్సరాలు కలిసి జీవించడంవల్ల అతనిని గురించి, ఆమెని గురించి మీరు ఒక మనోబింబాన్ని ఏర్పరచుకొని వుంటారు. అందుకని