Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

కృష్ణమూర్తి తత్వం

సావధానతను అలవరచుకోవాలని అపేక్షిస్తున్నారన్నమాట. ఒక పద్ధతినిగాని, ఒక విధానాన్నిగాని అనుసరిస్తున్నప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి? ఒక నిర్ణీతమైన కార్యక్రమాన్ని మళ్ళీ మళ్ళీ చేయడం ద్వారా యాంత్రికంగా కొన్ని అలవాట్లను అలవరచుకుంటున్నారు; దీనివలన మనను మందకొడిగా తయారవుతుంది. దీనివలన, మనసుకు చురుకుదనం కలగదు, మీరు గనుక ఒక సెకను సేపు కాని, ఒక నిముషం సేపు కానీ సంపూర్ణమైన సావధానతను చూపారంటే, అప్పుడు యీ క్షణికమైన సంపూర్ణ సావధానత మీరు భయపడుతున్న దానిని తుడిచి వేసేస్తుంది. ఈ సావధానతలో పరిశీలకుడు కాని, పరిశీలిస్తున్న అంశం కానీ రెండూ వుండవు. అప్పుడు మనం దేనిని పరిశీలిస్తున్నామో అదే పరిశీలకుడు కూడా. అయితే, యిది అర్ధం చేసుకోపోలంటే, దీనిని గ్రహించాలంటే స్థలం-కాలం అనే మొత్తం సమస్యను మనం తరచి శోధించాలి.

అయితే చూడండి, అవస్థ ఏమిటంటే- మన నిబద్ధీకరణ ఎంత పటిష్టంగా వుంటుందంటే అసలు మనం సూటిగా చూడనూ లేము, అడగలేము, ఏ ప్రశ్నలూ వేయలేము. మనకి ఏ సందేహాలూ రావు. మనం అంతా అనుయాయులం. మనందరం “అవునవును” అంటూ తలలూపే జీవులం. ప్రస్తుత విషమస్థితి మీరు మరొకరిని అనుసరించడానికి వీల్లేదని గట్టిగా హెచ్చరిస్తున్నది. గందరగోళంలో చిక్కుకున్న మీరు మరొకరిని అనుసరించకూడదు. ఎందుకంటే గందరగోళపు స్థితిలో వున్న మీరు యింకొకరినీ అనుసరిస్తున్నారంటే, అయోమయంలో పడి అనుసరిస్తున్నారు తప్ప సుస్పష్టంగా తెలుసుకొని కొదు. స్పష్టంగా తెలుసుకొని వుంటే మీరు యింకొకరిని అనుసరించడం అనేది వుండనే వుండదు. మీరు గందరగోళపు స్థితిలో వుండటం వలన మరొకరిని అనుసరిస్తూ వుంటే మరికొంత గందరగోళాన్ని సృష్టిస్తారు. కాబట్టి ముందుగా మీరు చేయవలసినది ఏమిటంటే యిక్కడ ఆగి, లోతుగా శోధించండి. సూటిగా చూడండి, వినండి.

దురదృష్టం ఏమిటంటే, యీ దేశపు సంస్కృతి అని అంటూవుంటామే అది. చాలా పురాతనమైనది. 'సంస్కృతి' అనే పదం చాలా గొప్పదే; కానీ రాజకీయవేత్తలు, బుద్ధి కొంచెం తక్కువగా వున్నవారు, అంటే కొత్తది ఏదీ ఆలోచించడం చేతగానివారు యీ మాటను పాడుచేసి పెట్టారు. తమ బుద్దిహీనతకీ ముసుగువేసి దాచడానికి సంస్కృతి అనే యీ మాటని వాళ్ళు వుపయోగించుకున్నారు. అయితే విభిన్నమైన మరొక సంస్కృతిని- సంస్కృతి అంటే అర్ధం ఎదుగుదల, వికాసం; జడమైన స్థితిలో ఆగిపోయి వుండటం కాదు- తీసుకురావాలంటే, దానిని అవగాహన చేసుకోవాలంటే ముందుగా మనతోనే ఆరంభించాలి. ఎందుకంటే మీరు యీ సంస్కృతికి- ఎన్నో