Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

కృష్ణమూర్తి తత్వం

ఆవశ్యకమైనప్పుడు మాత్రమే ఆలోచించడం సాధ్యమేనా?” అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటారు, సర్! ఒక కార్యాలయంలో మీరు వుద్యోగం చేస్తున్నప్పుడు, ఒక ప్రత్యేకమైన పనిని నిర్వహిస్తున్నప్పుడు ఆలోచన అవసరం; అది లేకపోతే మీరు ఏ పనీ చేయలేరు. వుపన్యసిస్తున్నప్పుడు, వ్రాస్తున్నప్పుడు, సంభాషణ జరుపు తున్నప్పుడు, మీరు మీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఆలోచన అవసరం. అక్కడ అది ఖచ్చితంగాను, నిష్పక్షపాతంగాను వుండాలి. అక్కడ మన అభిరుచి, మన స్వభావలక్షణం ఆలోచనను నడిపించకూడదు. అయితే యితర కార్యకలాపాలకు ఆలోచన అవసరం వున్నదా?

దయచేసి దీనిని అర్ధం చేసుకోండి. ఆలోచన మనకు చాలా ముఖ్యమైనది; మనకు వున్న ఒకే ఒక పనిముట్టు ఆదే. స్మృతి ప్రతి స్పందించడమే ఆలోచన. స్మృతి అంటే అనుభవం ద్వారా, జ్ఞానం ద్వారా, సంప్రదాయం ద్వారా పోగుచేసుకున్నది. స్మృతికి కారణమైనది కాలం; స్మృతి జంతువుల నుండి సంక్రమించినది. ఈ నేపధ్యంలో మనం ప్రతి స్పందిస్తూ వుంటాం. ఈ ప్రతిస్పందనే ఆలోచన. కొన్ని కొన్ని రంగాలలో ఆలోచన ఆవశ్యకత వుంది. అయితే ఆలోచన భవిష్యత్తుగానూ, గతంలోనూ తనని తాను మానసికమైన స్థాయిలో ప్రదర్శించుకున్నప్పుడు, అప్పుడు ఆలోచన భయాన్నీ, సుఖాన్నీ కూడా సృష్టిస్తుంది. ఈ విధానంలో మనసు మొద్దుబారిపోతుంది. కాబట్టి క్రియ లేని జడత్వం తధ్యం. సర్! ఆలోచన వల్లనే భయం కలుగుతున్నది. ఉద్యోగం పోతుందేమోనని ఆలోచించడం, నా భార్య మరొకరితో కలిసి పోరిపోతుందేమోనని ఆలోచించడం, మరణం గురించి, జరిగిపోయిన దానిని గురించి ఆలోచించడం మొదలైనవి. ఆలోచన గతాన్ని గురించిగానీ, భవిష్యత్తును గురించి గానీ ఒక మనోతత్వంగానో స్వీయ రక్షణ కోసమో ఆలోచించడం మానేయ్యగలదా?

మీకు యీ ప్రశ్న అర్ధం అవుతున్నదా? చూడండి, మనస్సు- అందులోనే మెదడు కూడా వున్నది- తానే భయాన్ని తయారు చేయగలదు, దానిని తట్టుకోనూ గలదు. భయాన్నీ తట్టు కోవడం అంటే దానిని అణచివేయడం, క్రమశిక్షణలో పెట్టడం, అదుపులో పెట్టడం, దానిని కొంత మార్చివేసి మరో పేరు పెట్టడం అనమాట. అయితే యిదంతా వుంటే ఘర్షణ వుంటుంది, వుండదూ? నేను భయపడుతున్నప్పుడు, “దీనిని అదుపులో పెట్టాలి, దీని వద్ద నుంచి పారిపోవాలి, దీనికి దూరంగా వెళ్ళిపోవాలి” అని నాలో నేనే అనుకుంటాను- దీనంతటికీ అర్ధం సంఘర్షణ వున్నదని; వున్నది కదూ? ఈ సంఘర్షణ వలన శక్తి వృధా అవుతుంది. అయితే భయం ఎట్లా పుడుతుందో నేను అవగాహన చేసుకుంటే, అప్పుడు దానితో నేను తలపడగలను. ఆలోచన భయాన్ని ఎట్లా సృష్టిస్తున్నదో నేను చూశాను. అందుకని, “ఆలోచన ఆగిపోవడం సాధ్యమేనా,