ప్రసంగాలు
11
దీనిని అధిగమించి ఆవలగా పోవాలి. అందుకని దయచేసి వినండి. మీ జిత్తులమారి మనసుతో కాదు; “నేను వింటాను, నాకు యింతకు ముందే తెలిసిన దానితోనో, యింతకు ముందు విన్న వాటితోనో తను చెప్పేది పోల్చి చూస్తాను" అని అనకండి, అంటే అర్థం మీరు వినడం లేదన్నమాట. వినడం అంటే మీ సంపూర్ణమైన ధ్యాసను అంటే సావధానతను యివ్వాలి. సంపూర్ణమైన సావధానం యివ్వడం అంటే శ్రద్ధ చూపడం. వాత్సల్యం వున్నప్పుడే, ప్రేమ వున్నప్పుడే మీకు సావధానత్వం కూడా వుంటుంది. అంటే అర్థం యీ భయం అనే సమస్యను మీరు పరిష్కరించుకోవాలని కోరుతున్నారు అని. అది పరిష్కరించుకున్నప్పుడు ఒక మనిషిగా, చెడిపోతున్న యీ ప్రపంచంలో ఒక ఒయాసిస్సును సృష్టించే స్వేచ్ఛామానవునిగా మీరు తయారవుతారు.
కాబట్టి ఆలోచన భయానికి జన్మనిచ్చి పోషిస్తుంది. నా వుద్యోగం పోగొట్టుకోవడం గురించో, నా వుద్యోగం పోతుందేమో అన్నదాన్ని గురించో నేను ఆలోచిస్తాను. ఈ ఆలోచన భయాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఆలోచన ఎప్పుడూ కాలంతో కలిపి తన్ను తాను ప్రదర్శించుకుంటుంది. ఎందుకంటే ఆలోచన అంటేనే కాలం. నాకు మునుపు వచ్చిన వ్యాధి గురించి నేను ఆలోచిస్తాను. నాకు బాధ అంటే యిష్టం లేదు, బాధ మళ్ళీ తిరిగి వస్తుందని నేను భయపడతాను. నాకు బాధ అనే ఒక అనుభవం జరిగింది; దానిని గురించి ఆలోచించడం, అది నాకు రాకూడదని కోరుకోవడం భయాన్ని సృష్టిస్తాయి. భయానికి సుఖానికి చాలా సన్నిహిత సంబంధం వుంది. మనలో చాలా మందిని సుఖమే నడిపిస్తుంది. జంతువులకీ లాగే మనకి కూడా సుఖం చాలా ప్రధానమైనది. ఈ సుఖం అనేది ఆలోచనలోని భాగమే. మనకు సుఖం కలిగించిన ఒకదానిని గురించి ఆలోచించడంవల్ల ఆ సంతోషం లేదా ఆ సుఖం మరికాస్త ఎక్కువవుతుంది. అవును కదూ? ఇదంతా మీరు గమనించలేదూ? ఒక సంతోషకరమైన అనుభవం మీకు కలుగుతుంది. అందమైన ఒక సూర్యాస్తమయం లేదూ సెక్స్- దానిని గురించి మీరు ఆలోచిస్తారు. దానిని గురించి ఆలోచించడం వల్ల (సుఖం) ఎక్కువవుతుంది. ఒకప్పుడు మీకు కలిగిన బాధను గురించి ఆలోచించడం భయాన్నీ పుట్టించినట్లుగానే యిదీ, కాబట్టి ఆలోచనే సుఖాన్నీ, భయాన్నీ సృష్టిస్తున్నది. అవును కదూ? సుఖం కావాలని, ఆ సుఖం యింకా కొనసాగాలని ఒత్తిడి జరగడానికి ఆలోచనే కారణం; భయాన్ని పుట్టించడంలో భయభీతిని కలిగించడంలో బాధ్యత ఆలోచనదే. మనంతట మనమే యిది చూడవచ్చు. ఇది నిజంగానే ప్రయోగం జరిపి తెలుసుకున్న వాస్తవం.
ఇప్పుడు, “సుఖం గురించి కాని, బాధ గురించి కాని ఆలోచించకుండా వుండటం సాధ్యమేనా? ఆలోచన యొక్క ఆవశ్యకత లేనప్పుడు కాకుండా ఆలోచన