సమస్త బంధనాల నుండి విముక్తం చేయడమే ప్రధానాంశంగా ప్రసంగించాడు. సత్యం అనేది బాటలులేని సీమ అని, అది చేరుకోవడానికి మతాలు గాని, సంస్థలుగాని, గురువులు గాని అవసరం లేదని నొక్కి చెప్పారు.
మత ధర్మమూ, తాత్వికతా, మనోతత్వ విచారణా కలిసి, అపూర్వమైన తీరులో సమ్మేళవించుకున్న కృష్ణమూర్తి బోధనలు సమగ్రమైన సంపూర్ణ జీవిత దర్శనాన్ని నిర్ధుష్టశైలిలో మనకు అందిస్తాయి.
1986 లో ఫిబ్రవరి 17న అమెరికాలోని ఒహాయిలో తుదిశ్వాస వదిలే వరకు, 60 సంవత్సరాల పాటు యూరప్, అమెరికా, లాటిన్ అమెరికా, శ్రీలంక, భారత దేశాలలో నిర్విరామంగా పర్యటించి ప్రసంగించారు. అసంఖ్యాకమైన ప్రజలను ప్రభావితం చేశారు.
ద్వేషాలూ, అసూయలూ, సంఘర్షణలూ, జాతి మత విభజనలూ లేని ఒక నూతన ప్రపంచాన్ని నిర్మించాలంటే విద్యా విధానంలోనే మార్పు రావాలనే దృక్పథంతో ఇండియా, అమెరికా, కెనడాలలో విద్యాసంస్థలను స్థాపించారు.
కృష్ణమూర్తి రచనల తెలుగు అనువాదాలు పాఠకులలో జీవితం ఎడల విచారణ శీలత్వాన్నీ, పరిశీలనా శక్తిని పెంపొందిస్తాయని ఆశిస్తున్నాము.
వసంత విహార్ |
సమన్వయకర్త, |