ప్రసంగాలు
5
ఒక ముస్లింగానో, ఒక పార్శీగానో, ఒక క్రైస్తవునిగానో చెప్పే ఒక నిబద్దమైన సమాధానంతో కాదు. వారంతా మరణించారు, వెళ్ళిపోయారు, సమాప్తమయినారు. ఆ మాటలకు యిక మీదట ఏ అర్ధమూ లేదు. అజ్ఞానాన్ని, అంధ విశ్వాసాన్ని స్వలాభానికి వుపయోగించుకునే ఒక్క రాజకీయనాయకులకి తప్ప, ధర్మశాస్త్రాలు, తత్వవేత్తల బోధలు, మతాచార్యులు జారీ చేసే ఆజ్ఞలు, విధేయతతో అనుష్టించి, అనుసరించ వలసిన వారి నియమాలు- ప్రపంచ సమస్యలను గురించిన ఎరుక, చైతన్యం వున్న మనిషికి వాటిల్లో అర్ధమేమీ కనబడటం లేదు.
చూడండీ, తను యింతకాలం నమ్మినదానిలో మనిషికి విశ్వాసం పోయింది. రాజకీయాల్లో వుపన్యాసకుడి మీద ప్రేక్షకులు చెప్పులూ, రాళ్ళూ విసురుతున్నారంటే ఏమిటో మీకు అర్ధమవుతున్నదా? అంటే అర్థం వాళ్ళు ఆ నాయకత్వాన్ని త్రోసి రాజంటున్నారన్నమాట. ఇక మీదట ప్రజలు తాము ఏం చేయాలో మరొకరు చెప్పడం సాగనివ్వరు. మనిషి విపరీతమైన నిస్సహాలో పడిపోయాడు. మానవుడు గజిబిజి స్థితిలో చిక్కుకునిపోయి వున్నాడు. అపరిమితమైన దుఃఖం వుంది. ఏ సిద్ధాంతాలైనా సరే, వామపక్షపువిగాని, మరో పక్షపువి గానీ వాటికి అర్థం లేదు. సిద్ధాంతాలన్నీ మూర్ఖమైనవనే చెప్పాలి. 'ఉన్నది' ఏమిటి అనే అసలైన వాస్తవాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు అవి ఎంత అర్ధంలేనివో తెలుస్తుంది. కాబట్టి నాయకుల ఆధిపత్యమే కాదు, మతాచార్యుడి ఆధిపత్యం, పవిత్రగ్రంధపు ఆధిపత్యం, మతధర్మపు ఆధిపత్యం వేటినీ మనం లక్ష్య పెట్టనక్కరలేదు. సత్యం ఏది అనేది తెలుసుకోవాలంటే వీటిని మనం వుపేక్షించి తీరాలి. అంతేకాకుండా జరిగిపోయినదాని వద్దకు, వెనక్కి మనం వెళ్ళలేము.
మీకు తెలుసు, ఈ దేశంలో భారతీయ వారసత్వం అనీ, ప్రాచీన భారతజాతి అనీ తరచు వింటూవుంటాం. గత కాలం గురించీ, ఒకప్పటి భారతదేశం గురించీ వాళ్ళు తుదీమొదలూ లేకుండా మాట్లాడుతూనే వుంటారు. గతించిపోయిన సంస్కృతుల గురించి మాట్లాడే మనుష్యులకు ఆలోచించే శక్తి తక్కువ. వాళ్ళు జరిగిపోయిన వాటిని, గ్రంధాల్లో వున్న విషయాలను మళ్ళీ మళ్ళీ వల్లె వేస్తూవుంటారు. ఇది ప్రజలను జోకొట్టే మత్తుమందుగా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి వాటన్నింటినీ మనం తిరస్కరించాలి. వాటన్నింటినీ శుభ్రంగా వూడ్చి అవతల పారేయచ్చు. పారవేసి తీరాలి. ఎందుకంటే మనకి వున్న సమస్యలు మనల్ని ఆ సమస్యల ఎడల అత్యంతమైన సావధానత్వం, లోతయిన ఆలోచన, విచారణ చూపించమని ఒత్తిడి చేస్తున్నాయి. అంతే తప్ప, ఎవరో ఒకరు వారు ఎంత గొప్పవారయినా సరే, వారు చెప్పినది పునశ్చరణ చేయమనీ కాదు. కాబట్టి ఒకప్పుడు జరిగిపోయిన విషయాలను, యీ ఘోరమైన