పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృష్ణమూర్తి : వికాసోదయం

xxxix

ప్రశ్నించే వైఖరితో జీవితాన్ని ఎదుర్కొనడాన్నీ విద్యార్థులలో పెంచి పోషించడానికి కంకణం కట్టుకొన్నాయి.

కృష్ణమూర్తి తన గురించి తానే స్వయంగా యిచ్చిన సమాచారంలో, తనలో జరిగిన వికాసాన్ని అవగాహన చేసుకోవాలంటే ఒక కీలకం తనలో స్వతఃగా వున్న “అపార నిశ్శబ్దం' అని అన్నారు. ఈ అపారత్వమే తను జన్మించిన మూఢ నంవ్రదాయాచారాలనుంచి విముక్తి కలిగించింది; టీఎస్ లో పొందిన అధివాస్తవికమైన పెంపకపు తీరునుండి నిండుగా, నిష్కల్మషంగా నిర్గమింపజేసింది; ఇంగ్లాండులో విద్యార్ధి దశలో వున్నత విద్యలో వుత్తీర్ణత పొంద లేక పోయినప్పుడు తట్టుకొనడానికి అదే సహాయపడింది. అతని బోధనలకు హృదయస్థానంలో వున్న నిశ్శబ్దం అడ్డుగోడలను కరిగించి వేసింది.

“మీరు ఒక అమెరికనూ కాదు, రష్యనూ, హిందూ, ముస్లిమూ కాదు. మీరంటే యీ పేర్లు, యీ మాటలు కాదు. మీరు వేరు. మీరు మానవాళిలో ఒకరు. ఎందుకంటే మీ చేతన, మీ ప్రతిస్పందనలూ, మీ విశ్వాసాలూ, మీ నమ్మకాలు, మీ సిద్ధాంతాలూ, మీ భయాలూ, మీ ఆందోళనలూ, ఒంటరితనం, దుఃఖమూ, సుఖమూ అన్నీ తక్కిన మానవాళికి వున్నటువంటివే. మీరు కనుక మారితే అది మానవాళి నంతటినీ ప్రభావితం చేస్తుంది.”

ఆ అపార నిశ్శబ్దాన్ని, సంవత్సరాల తరబడి పెంచి పోషించి, సంపూర్ణం చేస్తుండటం వల్ల అతని సుదీర్ఘ జీవితం పొడుగునా స్రవించే బ్రహ్మాండమైన విస్తృతత్వాన్ని సంతరించుకున్నది.

***

పంధొమ్మిదో శతాబ్దపు ఆలోచనలలో లోతుగా పాతుకొనిపోయిన పురోభివృద్ధి భావం డార్విన్ ప్రతిపాదించిన పరిణామవాదాన్ని అతిగా విస్తరించి, దానికి పుట్టుక నిచ్చిన జీవశాస్త్ర రంగాన్నుంచి బయటకు లాక్కొని వచ్చింది. ఆ యుగంలో ప్రతి విషయంలోనూ యీ వుపమానాన్ని ఒక మార్గదర్శకసూత్రంగా తయారు చేసుకున్నారు. ఇప్పుడు నిరాదరించినా ఒకప్పుడు ప్రకృతిలో మానవుడే అత్యున్నత ప్రాణి అనే ఆధిక్యభావం వున్న రోజుల్లో దానిని బలపరచడానికి ఆ పరిణామక్రమ వాదాన్ని వాడుకోవడం జరిగింది. ఆ తరువాత రోజుల్లో సర్వశ్రేష్ఠ అధికార జాతి అనే ఒక దుష్ట సిద్ధాంతం ప్రబలడానికి కూడా దీనిని ఎంచుకున్నారు. వామపక్ష రాజకీయాల్లోని సమాజ సంస్కర్తల్లో అద్భుతమైన ఆదర్శాలతో కూడుకున్న కమ్యునిస్టు వాదానికి స్ఫూర్తి నిచ్చింది. మరో పక్షపు రాజకీయాల్లోని ఆదర్శవాదులకు ప్రస్తుత ప్రపంచంలోని