కృష్ణమూర్తి వికాసోదయం
xxxiii
పరిణామం చెందుతుందని దివ్యజ్ఞానం హామీ యిస్తుంటే, అప్పటి రోజుల్లోనే కృష్ణమూర్తి తన బోధల్లో ఒక విప్లవం వంటి దానిని లక్ష్యంగా ప్రకటించాడు.
* * *
ఒక కొత్త తరానికి చెందిన దివ్యజ్ఞాన సామాజికులు, అధికారశ్రేణిలో తమ స్థానాలకోసం వుత్సాహంతో ముందుకొస్తున్నారు. హాలెండులోని హ్యుజెన్ లో జార్జి అరండేల్ నాయకత్వం వహించాడు. 1925 ఆగస్టులో వారం రోజులపాటు జరిగిన అతి ముఖ్యమైన సమావేశాల్లో అతడు వరుసగా కొన్ని జ్యోతిర్ సందేశాలు 'భూమి మీదకు' తీసుకొచ్చాడు. తననూ, తన సహచరులనూ 'మార్గం' లో ముందుకు తీసుకొని పోవడం కోసమని. ఇంతవరకు శ్రీమతి బెసెంటు, లెడ్ బీటర్లు మాత్రమే నాల్గవ వుపదేశం' దాట గలిగారు. ఇప్పుడు తనకు, లేత వయసులో వున్న తన భార్య రుక్మిణీ దేవికీ, కృష్ణమూర్తికీ యీ హోదా అనుగ్రహింపబడిందనీ అరండేల్ ప్రకటించాడు. అంతే కాకుండా మైత్రేయుడు పన్నెండుమందిని ప్రధాన శిష్యులుగా ఎన్నుకున్నాడనీ త్వరలోనే వారి పేర్లను తెలియ పరుస్తారనీ కూడా అన్నాడు.
శ్రీమతి బెసెంటు యిప్పుడు డబ్బయి సంవత్సరాల వృద్ధురాలు. కళ్ళు తిరిగే వేగంతో సాగుతున్న పరిణామాలు ఆమెను సమ్మోహపరిచాయి. హాలెండులో జరిగిన తారక సభలో ప్రధానశిష్యులుగా ఎన్నుకోబడిన ఏడుగురి పేర్లను ఆమె తెలియపరచింది. వారు వెడ్జ్ వుడ్, లెడ్ బీటర్, జినరాజదాస, అరండేల్, రుక్మిణీదేవి, ఆస్కార్ కొల్ స్ట్రామ్, తనూ. పరమాత్మ అవతరించే శుభసందర్భాన్ని కొనియాడుతూ ఒక ప్రపంచ విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తున్నట్లుగా కూడా ప్రకటించింది. దానికి తను ప్రధాన అధ్యక్షులుగా, అరండేల్ ప్రధానోపాధ్యాయులుగా, జేమ్స్ వెడ్జ్ వుడ్ అధ్యయన శాఖాధ్యక్షులుగా వుంటారని తెలియపరచింది. దూరంగా ఒహాయిలో వున్న కృష్ణమూర్తి యిదంతా నమ్మలేదు. అతనికి యిదంతా అనుమానాస్పదంగా అనిపించింది. నిత్యకు తీవ్రంగా జబ్బు చేయడం వల్ల అతనికి శుశ్రూష చేయడంలో మునిగిపోయి వున్న కృష్ణమూర్తికి, యీ ప్రకటించబడిన 'జ్యోతిర్లోకపు స్టాయి' సంఘటనల్లో తాను పాల్గొన్నట్లుగా గుర్తు లేదు. అరండేల్ తదితరులు వున్నత దశను చేరుకోవడాన్ని అతను రూఢి పరచలేదు. వారిని ప్రధాన శిష్యులుగా కూడా అతను అంగీకరించలేదు.
క్షయవ్యాధితో పోరాటంలో ఓడిపోయిన నిత్య నవంబరు 1925 లో ఒహాయిలో మరణించాడు. ఆ సమయంలో కృష్ణమూర్తి భారతదేశానికి వెళ్తున్న ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. అడయారులో జరుగబోయే దివ్యజ్ఞానంవారి స్వర్ణోత్సవాల కోసం అతను వెళ్తున్నాడు. ఓడ సూయజ్ కాలువను సమీపిస్తుండగా, మొదట నిత్య ఆరోగ్య పరిస్థితి