Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxxi

కృష్ణమూర్తి తత్వం


ఏవైనా తన మాజీ శిష్యుడిని పట్టుకున్నాయేమోననే అనుమానంతో, దివ్యజ్ఞానంవారి వైద్యుని రహస్యంగా ఒహాయికి పంపించాడు; పరిస్థితిని గురించి తనకు నివేదిక పంపమన్నాడు. దురదృష్టవశాత్తు ఆమె పంపిన నివేదిక మనకు మిగులలేదు.

1925 లో 'పరమగురువులు-మార్గము' అనే గ్రంధాన్ని లెడ్ బీటర్ ప్రచురించాడు. ఇందులో ప్రధానంగా వున్న ప్రతీక ఆధ్యాత్మిక పధం- యిది ప్రపంచంలో వున్న అన్ని మతాల్లోనూ కనబడుతుంది. అన్నింటికంటే అత్యంత సుందరమైన చిత్రణ బొరుబదుర్ మహాస్తూపం మీద చూడవచ్చు. జీవితమూ, పునర్జన్మ అనే దీర్ఘమైన ఆధ్యాత్మిక పధానికి సంకేతంగా అక్కడ క్రమక్రమంగా అధిరోహణ చేస్తూ, మెలికలు తిరుగుతూ పైకి పోతున్న దారి ఒకటి వుంటుంది. ఈ మార్గానికి మధ్య మధ్యలో శిల్పాలు చెక్కి వుంటాయి. వాటిలో సుబంధు జ్ఞానోదయం (సంబోధి) అందుకోవడానికి చేసిన సుదీర్ఘ ప్రయాణం చెక్కి వుంది. ఆ ప్రాచీన ప్రయాణాన్ని అనుకరిస్తూ యాత్రీకులు శిఖరాగ్రాన్ని చేరుకోవడానికి ఎక్కుతూ వుంటే, బుద్దుని జీవితం గురించీ, అతను చేసిన సత్కిృయల గురించీ చెక్కిన శిల్పాలు దారి చూపుతుంటాయి. బాధ, విమోచనాలతో కూడుకొనివున్న ఆథ్యాత్మిక పధంలో మార్గదర్శకుల్లో అగపడే బోధిసత్వుల శిల్పాలు మార్గమధ్యంలో దర్శనమిస్తాయి.

భారతీయ తాత్విక సంప్రదాయంలోని శాఖలను రెండు రకాలుగా విభజించ వచ్చును. జ్ఞానోదయం లేక సంబోధి క్రమక్రమంగా జరుగుతుందా లేక హరాత్తుగా కలుగుతుందా అనేది యీ విభజనకు ఆధారం. నాగార్జునుడు 'లంఘనము' (గెంతు) ను నిర్దేశించిన తాత్వికుడు. అయితే పతంజలి యోగసూత్రాలలో క్రమానుగతమైన మార్గంలో జ్ఞానోదయం సిద్ధిస్తుందని అంటాడు. లెడ్ బీటరు అధిరోహణంలో నాలుగు దశలను గుర్తించాడు; దివ్యజ్ఞానంవారి యీ సూత్రాన్ని పైన పేర్కొన్న రెండు సంప్రదాయ ధోరణుల మధ్యన నిలబెట్టవచ్చును.

యూరపులో చిన్న చిన్న బృందాలతో సన్నిహితంగా పనిచేస్తూ ఆధ్యాత్మిక అధ్యయనం గురించి చర్చిస్తున్న యువకుడైన కృష్ణమూర్తిని పరీక్షిస్తుంటే ఒకటి స్పష్టమవుతుంది. ఒక ప్రత్యేక మార్గంనుండి అతడు 'లంఘనం’ తత్వం వైపు జరిగిపోతున్నట్లుగా కనబడుతుంది. ఇదే అతని భావప్రకృతికీ, మానవుని నిబద్దస్థితి గురించిన అతని అవగాహనకూ చక్కగా సరిపోతుంది. యువకులైన తన శిష్యులతో నిస్వార్థత, ప్రేమ, సొనుభూతుల విలువ గ్రహించమనీ, 'తెలియని దానిలోకి దూకండి... ప్రమాద పూరితంగా జీవించండి..., 'మారడం ఎంతో సులువు', అందులో ఎంతో 'సరదా' వున్నది అనీ వారిని ప్రోత్సాహపరుస్తూ బోధించేవాడు. ఆత్మ క్రమంగా