పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృష్ణమూర్తి : వికాసోదయం

xxxi


సుమారుగా యిదే సమయంలో అతడు లెడ్ బీటరుకు తనను క్షమించమంటూ ఒక లేఖ వ్రాశాడు. అందులో తనను దివ్యజ్ఞానానికి మళ్లీ పూర్తిగా పునరంకితం చేసుకుంటున్నానని, యికమీదట 'పరమగురువులనూ, పరమాత్ముడినీ, సేవించు కొనడమే తన భవిష్యత్ కార్యక్రమమనీ ప్రకటించాడు.

కర్తవ్య పరాయణుడిలాగా యీ విధంగా ప్రకటించినా, తన ఆధ్యాత్మిక అనుభవాన్ని మూలాధారంగా చేసుకొని ఏ ప్రత్యేక మత సంప్రదాయాన్నీ ఆరంభించ లేదు. అంతేకాదు, దినసరి జీవనంతో పొసగని ఒక అలౌకిక స్మృతిగా చేసుకొని అందులో జీవించనూ లేదు. దాని అవశేషమే అతని చేతనలోని 'మౌన స్థలం'. అక్కడే సత్యం ఎడల వుపేక్షతో వుండే వాటినన్నింటినీ వుంచి, పరీక్షించ గలిగేది; ప్రేమ ఎడల తటస్థంగా వుండే వాటిని సార్ధపరిచేదీ అక్కడే. ఆ నిశ్శబ్దాన్ని రోజువారీ జీవితంతో అన్వయించుకోవచ్చును, మరో లోకంతో కాదు, అది అవగాహనకు తలుపులు తెరచివుంచుతుంది తప్ప, రహస్య శక్తులకోసం కాదు.

ఈ సమయంలోనే, ఎంతో దైహికబాధతోనూ, వ్యక్తిత్వాన్ని ఛిద్రంచేయడంతోనూ కూడుకొని, పరమానందకరమైన దృశ్యాలను, ప్రశాంతపూర్ణమైన కాంతిని ప్రసాదిస్తూ, 'ప్రక్రియ' నెలల తరబడి కొనసాగుతూ వున్నది. అన్న దమ్ములు ప్రపంచమంతటా పర్యటిస్తూ వుంటే, ఖండాంతరాలలో, మహాసముద్రాలను దాటుతూ అదీ సాగిపోతూనే వున్నది. తన సోదరుడికి ఏం జరుగుతున్నదో నిత్యకు అర్ధంకావడం లేదు. కృష్ణమూర్తికి కూడా తన చేతనావర్తంలో జరుగుతున్న యీ మార్పుల అంతరార్థం ఏమిటో, చివరకు యిది దేనికి దారితీస్తుందో అన్నది అనవగాహంగా వుంది. దివ్యజ్ఞానానికి సంబంధించిన భాషలో చెప్పాలంటే, ఈ ప్రక్రియ అతీంద్రియ జ్ఞానాన్ని విస్తృత పరుస్తుందనీ, అతీంద్రియమైన సత్యాలకు 'ప్రత్యక్షబోధ' అనీ అన్నట్లుగా వారి ఆలోచనలు సాగాయి. అయితే అట్లా జరగలేదు. అసలు జరిగిందేమిటంటే, ఆ 'నిశ్శబ్దస్థలం' మరింత గాఢమై, ఒక కాంతిపుంజంగా తెరచుకున్నది. అది ఒక సంఘటన కాదు, కృష్ణమూర్తి స్వతఃసహజంగానే ప్రవహించిన ఒక స్థితి అది.

అన్న పడుతున్న అవస్థ నిత్యలో ఆందోళన రేకెత్తించిందీ; సలహాల కోసం లెడ్ బీటరును ఆర్ధించాడు. అయితే లెడ్ బీటర్ యీ విషయంలో తాటస్థ్యం వహించినట్లు, అనుమానాలు వెలిబుచ్చుతున్నట్లు నిత్యకు అర్ధమైంది. ఆస్ట్రేలియా నుండి రాసిన సమాధానంలో లెడ్ బీటరు, ప్రస్తుతం కృష్ణమూర్తి 'మూడవ వుపదేశం'లో వుత్తీర్ణుడయాడనీ, అయితే తాను మాత్రం నాల్గవ వుపదేశం ఎప్పుడో దాటేసినట్లూ, పైగా ఒహాయి 'ప్రక్రియ' లాంటి శారీరక దుష్ఫలితాలేవీ తాను పొందనట్లూ వ్యక్త పరచాడు. ఈ జరుగుతున్న మార్పులన్నీ లెడ్ బీటరునూ కలత పెట్టాయి; 'దుష్టశక్తులు'