200
కృష్ణమూర్తి తత్వం
నివసించక తప్పదు. ఈ జీవితాన్ని వదిలేసి దూరంగా ఎక్కడికీ పారిపోలేరు. అయితే మీరు కనుక ఆలోచనలను, దుఃఖాన్నీ, సుఖాన్ని సంపూర్ణంగా త్యజించివేస్తే, అప్పుడు మీ బాంధవ్యం అంతా వేరుగా వుంటుంది. అందువల్ల సంపూర్ణంగా త్యజించడం జరగాలి. పాక్షికంగా త్యజించడం కాదు. ఇష్టమైనవి వుంచుకోవడమూ, యిష్టంకానివి త్యజించడమూ కాదు.
సరే, యిప్పుడు మీరు అవగాహన చేసుకున్న దానిని విద్యార్థికి ఎట్లా విడమరచి చెప్తారు?
అధ్యా : బోధించడంలో, నేర్చుకోవడంలో వుండవలసినది ఒక ప్రగాఢమైన స్థితి అనీ, అక్కడ 'నేను యీ విషయం నీకు నేర్పిస్తున్నాను' అన్న దృష్టి వుండదనీ మీరు చెప్పారు. ఇప్పుడు, ఆలోచన వదిలే మరకలను నిరంతరం తుడిచివేస్తూ వుండటానికి, 'బోధించడం నేర్చుకోవడం' స్థితిలోని ప్రగాఢత్వానికీ సంబంధం వున్నదంటారా?
కృ: నిస్సందేహంగా. చూడండి, బోధించడమూ నేర్చుకోవడమూ రెండూ ఒకటే అని నేననుకుంటున్నాను. ఇక్కడ జరుగుతున్నది ఏమిటీ; నేను మీకు బోధించడం లేదు. నేను మీకు ఆధ్యాపకుడినీ కాదు, అధికారినీ కాదు. నేను అన్వేషణ సాగిస్తూ వున్నాను. నా అన్వేషణలను మీకూ తెలియ పరుస్తున్నాను. అవి అందుకుంటారా, వదిలేస్తారా - అది మీ యిష్టం. విద్యార్థుల విషయంలో కూడా యిట్లాంటి వైఖరే వుండాలి.
అధ్యా : అప్పుడు అధ్యాపకుడు చేయవలసినది ఏమిటి?
కృ : నిరంతరమూ త్యజించివేస్తూ వున్నప్పుడే మీరది కనిపెట్టగలుగుతారు. ఎప్పుడయినా ప్రయత్నించి చూశారా? అది పగటివేళలో ఒక్క నిముషం కూడా నిద్రపోకుండా వుండటం లాంటిది.
ఆధ్యా : సర్! దీనికీ ఎంతో శక్తి అవసరం. అయితే దీనివలన ఎంతో శక్తి లభిస్తుంది కూడా.
కృ : కానీ, ముందుగా త్యజించడానికి మీకు శక్తి కావాలి.
(కృష్ణమూర్తి ఆన్ ఎడ్యుకేషన్)