సంభాషణలూ, సంవాదాలు
199
చేసుకుంటున్నప్పుడు అది వదిలేసి, స్విట్జర్లాండులో గడిపిన మధుర క్షణాలు గుర్తుకి తెచ్చుకుంటూ వుంటామా? చాలా సంతోషకరంగా గడిపిన రోజు స్మృతులను ఎవరయినా త్యజిస్తారా? ఈ విషయం గురించి ఎరుక కలిగాక అప్పుడు వాటిని త్యజిస్తారా? ఇందులో నాటకీయత ఏమీ వుండదు. పరమ విచిత్రాలూ వుండవు. దీనిని గురించి యితరులకి ఏమీ తెలియనూ తెలియదు. అయినా సరే, ఒకే ఒక్క పెద్ద, బ్రహ్మాండమైన తుడిచిపెట్టేయడమే కాకుండా, చిన్న చిన్న విషయాలను సదా త్యజిస్తూ వుండటం, చిన్న చిన్న తుడిపివేతలూ, చిన్న చిన్నవి తొలగించుకోవడాలూ చాలా అవసరం. సంతోషకరమైనవి కానివ్వండి, అసహ్యకరమైనవి కానివ్వండి, జ్ఞాపకాలు అనే ఆలోచనలను, ప్రతి రోజూ ప్రతి క్షణమూ అవి లేవగానే వాటిని త్యజించివేయడం చాలా అవసరం. దీనివల్ల ఏదో ప్రయోజనం సిద్ధిస్తుందనీ కాదు, అజేయమైన ఒక పరమాద్భుత స్థితిలోకి ప్రవేశించడం కోసమూ కాదు. రిషీవేలీలో నివసిస్తుంటారు, ఏ బొంబాయి గురించో, రోము గురించే ఆలోచిస్తుంటారు. దీనివల్ల సంఘర్షణ పుడుతుందీ, మనసు మందకొడిగా తయారవుతుంది, విభజన జరిగి ముక్కలై పోతుంది. ఇదంతా గ్రహించాక దీన్నీ తుడిచి వేయగలరా? మనకు తెలియని ఒక అజేయమైన స్థితిలోకి ప్రవేశించడం కోసం కాకుండా వూరికేనే అన్నింటినీ తుడిచివేస్తూ వుండగలరా? అజ్ఞేయమైనది ఏమిటో మీరు ఎన్నటికీ తెలుసుకోలేరు. ఎందుకంటే యిది అజ్ఞేయమైనది అని మీరు గుర్తించిన మరుక్షణమే తిరిగి తెలిసిన దానిలోకే మీరు వచ్చేస్తారు.
గుర్తించడం అనే ప్రక్రియ అంటే తెలిసినదే కొనసాగే ప్రక్రియ. అజ్ఞేయమైనది ఏమిటో నాకు తెలియదు. కాబట్టి నేను చేయగలిగింది ఒక్కటే. ఆలోచన పుట్టగానే దానిని తుడిపివేస్తూ వుండటం.
ఆ పూవును చూస్తారు, దాన్ని తాకి చూస్తారు, ఆ సౌందర్యాన్ని, ఆ తీక్షణతను, వుజ్వలంగా మెరిసిపోతున్న దాని రంగునీ చూస్తారు. ఆ తరువాత మీరు నివసిస్తున్న మీ గది లోపలకు వెళతారు. హెచ్చుతగ్గులుగా వున్న కొలతలతో, వికారంగా వున్న మీ గదిలోకి వెళ్లారు. ఆ గదిలోనే నివసిస్తుంటారు. కానీ సౌందర్యం గురించిన ఒక అనుభూతి మిమ్మల్ని వదలదు. అందుకని ఆ పూవును తలచుకుంటారు. ఆ తలపు మీలో కలగగానే దాన్ని పట్టుకొని శుభ్రంగా తుడిచివేసేయాలి. అయితే ఎంత లోతులదాకా వెళ్ళి దానిని వెకలించి వేయగలుగుతారు; ఆ పూవుని, మీ భార్యని, మీ దేవుళ్ళని, మీ ఆర్ధిక జీవనాన్ని ఎంత లోతులనుండి వాటిని త్యజించి వేస్తున్నారు? మీ భార్యతో, మీ పిల్లలతో, యీ వికారమైన, భయంకరమైన సమాజంలో మీరు