Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

కృష్ణమూర్తి తత్వం

చేయకుండా చూడటం ఆనే యీ చర్య ప్రేమపూర్వకమైన చర్య. పారమార్థిక జీవనం అంటే యిటువంటి చర్య. అసలు జీవించడం అంటేనే యిటువంటి చర్య. పారమార్థికమైన మనసు అంటే యిటువంటి చర్య. కాబట్టి మతమూ, మనసూ, జీవితమూ, ప్రేమా యివన్నీ ఒకటే.

(ది అర్జెన్సీ ఆఫ్ ఛేంజ్)


నిజమైన పరిత్యాగం అంటే ---

అధ్యాపకుడు : విద్యార్థులతో ప్రసంగిస్తూ ఒకసారి మీరు, సమస్య ఏదయినా తలెత్తినప్పుడు వెంటనే దానిని పరిష్కరించుకోవాలని అన్నారు. ఇది ఎట్లా చేయగలుగుతాం అంటారు.

కృష్ణమూర్తి : ఒక సమస్యని వెంటనే పరిష్కరించాలంటే, ఆ సమస్యని అవగాహన చేసుకోవాలి. ఒక సమస్యని అవగాహన చేసుకోవడానికి కొంత సమయం అవసరమా, లేదూ అది గ్రహింపులోని తీక్షణతకూ, చూడటంలోని గాఢత్వానికి సంబంధించినదా? నాకో సమస్య వున్నదీ అనుకుందాం : నాకు గర్వం, అదీ సమస్య ఎందుకయింది అంటే దానివల్ల నాలో నాకే సంఘర్షణ, పరస్పర వైరుధ్యమూ కలుగుతున్నాయి కాబట్టి. నాకు గర్వం అన్న సంగతీ వాస్తవమే, గర్వపడటం నాకు యిష్టం లేదు అన్న సంగతి మరొక వాస్తవమే. మొట్టమొదట, నాకు గర్వం అన్న వాస్తవాన్ని నేను అవగాహన చేసుకోవాలి. ఆ వాస్తవంతో నేను కలిసి నివసించాలి. ఆ వాస్తవం విషయంలో నాకు చాలా గాఢమైన ఎరుక వుండటమే కాకుండా, దానిని సమగ్రంగా ఆకళింపు చేసుకోవాలి. సరే, ఆకళింపు చేసుకోవడం అన్నది సమయానికి సంబంధించినదా? వాస్తవాన్ని నేను వెంటనే చూడగలను. చూడలేనా? తక్షణమే జరిగే ఆ గ్రహింపే, ఆ చూడటమే సమస్యను కరిగించివేస్తుంది. నేను ఒక పాముని చూసినప్పుడు తక్షణమే చర్య తీసుకుంటాను. అయితే గర్వాన్ని మాత్రం నేను ఈ రకంగా చూడటం లేదు. గర్వాన్ని నాలో చూస్తున్నప్పుడు, నాకు ఆది యిష్టం కాబట్టి ఆ విధంగానే కొనసాగుతోను; లేదూ దానివలన సంఘర్షణ పుడుతున్నది కాబట్టి అది నాకు అక్ఖర్లేదు, అంటాను. ఆది కనుక సంఘర్షణను కలిగించకపోతే అప్పుడు ఏ సమస్యా వుండదు.

గ్రహింపు, అవగాహన కాలానికి సంబంధించినవి కావు. గ్రహింపు చూడటంలోని తీక్షణతకు సంబంధించినది. అంటే సమగ్రంగా చూడటం. ఏదయినా ఒక విషయాన్ని సమగ్రంగా చూడటం అంటే ఎట్లా వుంటుంది? ఒక సమస్యతో మనకున్న మొత్తం