Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

కృష్ణమూర్తి తత్వం

సుఖము, బాధ, భయం మొదలైనవి ఎప్పుడూ మనల్ని అంటిపెట్టుకొనే వుంటాయని మనం ఏమాత్రం గ్రహించం, ఇది నాకు చాలా వింతగా అనిపిస్తుంది. చివరకు అవే మనమీద స్వారి చేస్తాయి. వాటిని అణగదొక్కాలని మీరు ప్రయత్నించవచ్చు. ఒక గట్టి నిశ్చయం వంటిది చేసుకొని, వాటిని లోపలకు నెట్టి పారేయాలని మీరు ప్రయత్నించవచ్చు; కాని అవి మళ్ళీ బయటపడుతూనే వుంటాయి. మనమీద చాలా ఎక్కువ ప్రభావం చూపే అంశాల్లో సుఖం ఒకటి. అందులోనూ మళ్ళీ సంఘర్షణలు, బాధ, విసుగు అన్నీ వుంటాయి. సుఖం కూడా బడలిక కలిగించడం, చిరాకు అనిపించడం మన జీవన మహాకల్లోలంలోని భాగమే. దానినుంచి తప్పించుకోలేవు మిత్రమా! ఈ లోతయిన అగాధమైన కల్లోలం నుంచి మీరు తప్పించుకోలేరు. నిజంగా మీరు దానిని గురించి గాఢంగా ఆలోచిస్తే తప్ప; ఒక్క ఆలోచించడమే కాదు, శ్రద్దతో కూడిన సావధానత్వంతో, శ్రమతో కూడిన అప్రమత్తతతో ఆలోచనలు, 'నేను' అనే మొత్తం కదలికను పరికిస్తే తప్ప. ఇదంతా చాలా అలసటైన పని అనీ, అనవసరం అనీ మీరనవచ్చు. కాని యీ విషయాల మీదకు మీరు ధ్యాస మళ్ళించకపోతే, పట్టించుకోకపోతే భవిష్యత్తు మర్తి విధ్వంసపూరితంగా, మరింత దుర్బలంగా వుండటమే కాకుండా పరమ అర్థవిహీనంగా కూడా తయారవుతుంది.. ఇదంతా ఒక నిరాశా జనకమైన, నిస్పృహ కలిగించేటటువంటి దృక్పధం కాదు. ఇది నిజంగానే యిల్లా వున్నది. ఇప్పుడు ప్రస్తుతంలో మీరు ఏమిటో రాబోయే కాలంలో కూడా అట్లాగే వుంటారు. దీనిని తప్పించుకోలేరు. సూర్యుడు వుదయించడమూ, అస్తమించడమూ ఎంత రూఢి అయినవో యిదీ అంతే. ఇది మనిషికి, మానవాళి అంతటికీ వచ్చిన వాటా. మన అందరం, మనలో ప్రతి వొక్కరమూ మారితే తప్ప. అంటే ఆలోచన చిత్రించినది కాని ఒకదానిగా మార్పు చెందితే తప్ప.

(కృష్ణమూర్తి టు హిమ్ సెల్ఫ్)

'నేను' ఎట్లా పనిచేస్తుంటుంది - ఒక అంతర్వీక్షణ

మానవుల్లో చాలామంది స్వార్ధపరులు. తమలో యింత స్వార్ధం వుందని వారికే తెలియదు. వారి జీవన విధానంలోనే ఆది వుంది. తను స్వార్థపరుడిననే సంగతి ఎవరైనా ఎరిగివున్నా ఆ సంగతిని వారు చాలా జాగ్రత్తగా దాచి పెడతారు. సమాజపు తీరు అంతా స్వార్థం మీద ఆధారపడే నడుస్తున్నది. కాబట్టి, ఆ సమాజపు పద్ధతులకి లోబడి వారు నడుస్తూ వుంటారు. స్వార్థపరమైన మనసు చాలా జిత్తులమారిది. అది చాలా మొరటుగా, బాహాటంగా తన స్వార్ధపరత్వాన్ని వెల్లడించుకోనూవచ్చు; లేదా