Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

కృష్ణమూర్తి తత్వం


మాటలతో కొని, అనుకూలమైనవో, ప్రతీకూలమైనవో నిర్ణయాలు చేసుకొని కాని మీరే మీ చుట్టూరా ఒక అవరోధాన్ని పేర్చుకోకండి అని నేను సలహా యివ్వ వచ్చునా. ఇటువంటి ఒక తెర లేకుండా పరిశీలన చేయగలరా? మరొక విధంగా చెప్తాను. మనసు ఒక వ్యాపకంతో వున్నప్పుడు సావధానత్వం వుంటుందా? మనసులో ఏ వ్యాపకమూ లేకుండా వున్నప్పుడే అది శ్రద్ధగా వినగలుగుతుంది. జాగ్రత్తతో గమనించడం వున్నప్పుడు మనసు మెల్లగా నడుస్తూ, అప్రమత్తంగా వుంటుంది. అదే నిర్వ్యాపరంగా వున్న మనసు యొక్క సావధానశీలత.

“సర్, మీరు చెప్తున్నది నేను స్వయంగా అనుభవాత్మకంగా గ్రహిస్తూ వున్నాను.”

ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి దీనిని పరీక్షిద్దాం. పరిశీలకుడికి, పరిశీలిస్తున్న అంశానికీ మధ్యన విలువలు బేరీజు వేయడం కాని, ఒక తెర కాని లేనప్పుడు ఆ రెండింటి మధ్య అప్పుడు విభజన వుంటుందా, అవి అప్పుడు విడివిడిగా వుంటాయా? పరిశీలకుడే పరిశీలిస్తున్న అంశం కాదూ?

'నాకు బొత్తిగా తెలియడం లేదు.'

వజ్రాన్ని దాని స్వభావశీల గుణాలనుంచి విడదీయలేము, విడదీయ గలమా? అసూయాభావాన్ని ఆ అసూయని అనుభవిస్తున్నవాడి నుంచి విడిగా విడదీయలేము. అయితే విభజన చేయగలం అనే భ్రమ వుంటుంది, అది సంఘర్షణకు ఆస్కారమవు తుంది. ఈ సంఘర్షణలో మనసు చిక్కుకొని పోతుంది. అసత్యమైన మీ విభజన మాయమైపోయి నప్పుడు స్వేచ్ఛ పొందడానికి అవకాశం వుంటుంది. అప్పుడు మాత్రమే మనసు నిశ్చలంగా వుంటుంది. అనుభవించేవాడు వేరుగా లేనప్పుడే యదార్ధమైనది. సృజనాత్మకంగా కదులుతుంది.

(కమెంటరీస్ ఆన్ లివింగ్ : సెకండ్ సిరీస్)