Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రచనలు

159

తోడ్పతాయా? వాటి నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తాయా? ఏదో ఒక వ్యాపకం మతపరమైనది కాని, మరొకరం కాని పెట్టుకోవడం ద్వారా రోజులో ప్రతి నిముషమూ మనసుని క్రమశిక్షణలో వుంచవచ్చు. వ్యాపకంతో వున్న మనసు స్వేచ్చగా వున్న మనసు కాదు. స్వేచ్ఛగా వున్న మనసుకే కాలరహితమైన సృజనాత్మకతను గురించిన ఎరుక వుంటుంది.

"కోరికలను అధిగమించడం ద్వారా స్వేచ్చ కలగదా?”

అదిగమించడం అంటే మీ అర్థం ఏమిటి?

"సంతోషాన్ని పొందడంకోసమే కాకుండా, ఆ పరమ ఔన్నత్యాన్నీ అందుకోవాలంటే కూడా కోరిక మనమీద స్వారీ చేయకుండా చూసుకోవడం అవసరం. కల్లోలంలో, ఆ గందరగోళంలో మనం చిక్కుకొనిపోకుండా వుండటం ముఖ్యం. కోరికలను అదుపు చేయాలంటే ఏదో రకంగా పోటీని లొంగతీసుకోవడం చాలా అవసరం. అల్పమైన విషయాల వెంటబడకుండా ఆ మహనీయమైన దానిని యీ కోరికే అన్వేషించవచ్చుగదా!”

కోరుకుంటున్న అంశాన్ని మీరు మార్చేయవచ్చు. ఒక యింటిని కాకుండా, జ్ఞానాన్ని, నీచమైన వాటిని కాకుండా వున్నతమైన వాటిని మీరు కోరుకోవచ్చు. అయితే అప్పుడు కూడా యిదంతా కోరిక చేస్తున్న పనేకదా, కాదంటారా? యీ లౌకిక ప్రపంచంలో గుర్తింపు కోవాలని మీరు కోరుకోకపోవచ్చు కాని స్వర్గాన్ని అందుకోవాలనే కాంక్ష కూడా ఒక ఫలితం కోసం ప్రాకులాడటమే కాదా?కోరిక ఎప్పుడూ సఫలం అవాలని, ఏదో అంది పుచ్చుకోవాలని చూస్తూ వుంటుంది. ఈ కోరికల కదలికలను అవగాహన చేసుకోవాలే తప్ప, వాటిని దూరంగా నెట్టివేయడమో, అణగదొక్కడమే కూడదు. కోరిక తీరుతెన్నుల్ని అవగాహన చేసుకోకుండా కేవలం ఆలోచనలను అదుపు చేయడంవల్ల లాభం లేదు.

“అసలు నేను మొట్టమొదట మొదలు పెట్టిన విషయానికి తిరిగివస్తాను. కోరికను అవగాహన చేసుకోవాలన్నా ఏకాగ్రత అవసరం కదా? అదే నాకు వచ్చిన ఇబ్బంది. ఆలోచనలను అదుపులో పెట్టలేకపోతున్నాను. అవి వాటి యిష్టం వచ్చినట్లు షికార్లు చేస్తుంటాయి. దొర్లిపోతుంటాయి. రకరకాల అర్థంలేని ఆలోచనలు వస్తూ వుంటాయి తప్ప వాటిలో ఒక్కటైనా గంభీరంగా కొనసాగేది వుండదు.”

మనస్సు రాత్రింబగళ్ళు పనిచేసే యంత్రం వంటిది. వాగుతూ వుంటుంది. నిద్రలోనూ, మెలకువలోనూ ఆగకుండా పనిచేస్తూనే వుంటుంది. దానికి వేగం ఎక్కువ,