Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

కృష్ణమూర్తి తత్వం


“మతం గురించి, మతాచారాల గురించి, ధ్యానం గురించి, పరమోత్కృష్టమైన దానిని అందుకోవడానికి అవలంబించవలసిన రకరకాల పద్ధతులను గురించి చాలా గ్రంధాలు చదివాను. ఒకప్పుడు నేను కమ్యునిజం ఆకర్షణలో పడ్డాను. అయితే, ఎంతమంది మేధావులు దానికి కట్టుబడి వున్నప్పటికీ, అది అభివృద్ధి నిరోధకమైనదని నాకయితే చాలా త్వరగానే తెలిసివచ్చింది. కేథలిక్ మతం కూడా సన్ను ఆకర్షించింది. దానిలోని కొన్ని వుపదేశ సూత్రాలు నాకు బాగా నచ్చాయి. కేథలిక్ గా మారాలని కొంతకాలం అనుకున్నాను కూడా. అయితే ఒకరోజు గొప్ప పండితుడైన ఒక కేథలిక్ మతాచార్యుడితో మాట్లాడుతున్నప్పుడు, యీ మతమూ కమ్యునిజం అనే జైలు రెండూ ఒకేలాగే వున్నాయని నాకు హఠాత్తుగా స్పష్టపడింది. ఒక ఓడలో నావికునిగా చేరి తిరుగుతున్న రోజుల్లో నేను భారతదేశానికి వెళ్ళాను. సుమారు ఒక సంవత్సరం అక్కడ గడిపాను. సన్యాసం పుచ్చుకుందామని అనుకున్నాను. కాని అసలు జీవితాన్నుంచి అది మనల్ని దూరం చేస్తుంది. కల్పితమైన ఆదర్శాలే తప్ప అందులో యదార్థం వుండదు. ఒంటరిగా జీవిస్తూ ధ్యానాన్ని సాధన చేయాలనుకున్నాను. అదీ అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు యిట్లో గడిపాక కూడా ఆలోచనలను అదుపు చేయడం నాకు బొత్తిగా చేతకావడంలేదనే అనిపిస్తున్నది. దీన్ని గురించే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇంకా చాలా సమస్యలున్నాయనుకోండి, సెక్స్ మొదలైనవి. ఆలోచనలను కనుక పూర్తిగా నా స్వాధీనంలో వుంచుకుంటే, అప్పుడు నాలో వున్న కోరికలను, నిగూఢమైన వాంఛలను నేను అదుపు చేసుకోగలుగుతాను.”

ఆలోచనలను అదుపు ఆజ్ఞల్లో పెట్టడంవల్ల కోరికలు నిమ్మలిస్తాయా, లేదూ వాటిని అణచివేయడం జరుగుతుందా? అణచివేయడం మళ్ళీ యితరమైన, యింకా లోతైన సమస్యలను తెచ్చిపెడుతుందా?

‘కోరికలకు లోబడి పొమ్మని మీరు సలహా యివ్వడంలేదనే అనుకుంటున్నాను. కోరిక ఆలోచనయొక్క స్వభావపు తీరు. ఆలోచనలను అదుపుచేసే ప్రయత్నాల ద్వారా కోరికలను జయించాలని ఆశించాను, కోరికలను జయించనన్నా జయించాలి, లేదా నిగ్రహించాలి. అయితే నిగ్రహించాలంటే ముందు వాటిని అదుపులో వుంచాల్సిందే. సాధారణంగా గురువులందరూ కోరికలను అధిగమించాలని నొక్కి చెప్తుంటారు. ఇది సాధించడానికి రకరకాల పద్ధతులను వాళ్ళు సూచించారు.'

తక్కినవారు చెప్పినది సరే, అసలు మీరు ఏమనుకుంటున్నారు? కోరికలను అదుపు చేసినంత మాత్రాన కోరికలవలన కలిగే సమస్యలన్నింటినీ పరిష్కరించు కోగలమా? కోరికలను అణచివేయడంకాని, నిగ్రహించడంగానీ వాటి అవగాహనకి