Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రచనలు

383

కొమ్మలమీద కూర్చొని వుండటంవలన కింద నడిచిపోతున్న మనుష్యులు వాటి దృష్టిలోకి రావడంలేదు. చీకటి పడుతుండగా వందలకొద్ది రామచిలకలు వచ్చి, గుబురుగా వున్న ఆకుల మధ్యన ఆ రాత్రికి మకాం వేస్తున్నాయి. అవి రావడం కనిపిస్తున్నది. కానీ వచ్చేక ఆ చిక్కని గుబురాకుల్లో అదృశ్యమైపోతున్నాయి. అమావాస్య దాటిన పాడ్యమినాటి చంద్రుడు సన్నగా బయటపడుతున్నాడు. దూరంగా నదివొంపు తిరిగిన చోట వున్న పొడుగాటి వంతెన దాటుతూ రైలు కూత వేస్తున్నది. ఈ నది చాలా పవిత్రమైనది. దూరదూరాలనుంచి ప్రజలు వచ్చి, తమ పాపాలు కడిగేసుకోవడానికి యీ నీళ్ళలో స్నానం చేస్తుంటారు. అసలు ప్రతి నదీ పవిత్రమైనదే, అందమైనదే. ఈ నదిలోని సౌందర్యం ఏమిటంటే విశాలంగా విస్తరించుకొని వున్న దోని వంపు, లోతయిన నీటి మడుగుల మధ్య ద్వీపాలవంటి యిసుక తిన్నెలు. ప్రతిరోజూ ఆ నది పైన నిశ్శబ్దంగా కదులుతూ, వచ్చీ పోయే తెల్లని తెరచాపలు.

'చాలా ప్రత్యేకమైన ఒక బాంధ్యవ్యం నుంచి స్వేచ్ఛ పొందాలని నేను కోరుకుంటున్నాను' అన్నది ఆమె.

స్వేచ్ఛ కావాలి అని అంటే మీ అర్థం ఏమిటి? నాకు స్వేచ్ఛ కావాలి' అని మీరు అంటున్నారంటే, దాని అర్ధం మీరు స్వేచ్ఛగా లేరు అన్నమాట. మీకు స్వేచ్ఛ లేనిది ఏ విషయంలో?

'భౌతికంగా నేను స్వేచ్చగానే వున్నాను. ఎక్కడికంటే అక్కడికి వెళతాను, వస్తాను. ఎందుకంటే యిప్పుడు నేను ఒకరి భార్యను కాను. అయితే ఇంకా సంపూర్ణమైన స్వేచ్ఛ నాకు కావాలి. ఆ మనిషితో ఇంక నాకు ఏ సంబంధమూ వుండకూడదు.'

భౌతికంగా మీకు స్వేచ్ఛ వచ్చేసినప్పుడు, ఆ వ్యక్తితో మీకొక ఏవిధమైన బాంధవ్యం వుంది? ఇంకేరకంగా నైనా అతనితో మీకు సంబంధం వుందా?

'నాకు తెలియదు కాని అతనంటే నాకు విపరీతమైన ఆగ్రహం వుంది. అతనికీ, నాకూ మధ్యన యిక ఏమీ వుండకూడదు.'

మీకు స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నారు. అయినా అతనంటే మీకు ఆగ్రహం వుందా? అంటే అర్థం మీరు అతని నుంచి విముక్తి పొంద లేదు అతనంటే ఎందుకు మీకీ ఆగ్రహం?

'ఈ మధ్యనే అతని అసలు స్వరూపం ఏమిటో తెలుసుకున్నాను. ఆ నీచత్వం, అంతటి ప్రేమరాహిత్యం, అంతటి విపరీతమైన స్వార్థపరత్వం. అతనిలో నేను కని పెట్టిన ఆ భయంకరత్వాన్ని గురించి నేను చెప్పలేను. ఒకప్పుడు అతని మీద యీర్ష్య