ఈ పుట అచ్చుదిద్దబడ్డది
xx
కృష్ణమూర్తి తత్వం
ఆధ్యాత్మిక పధంలో నవ్యారంభకుడైనాడు. శ్రీమతి బెసెంటుకు రాసిన ఒక లేఖలో మార్మికలోకంతో తన పరిచయం గురించి కృష్ణమూర్తి యీ విధంగా వర్ణించాడు :
"అప్పుడు ఆ మహాత్ముడు మొదటిసారిగా నాతో యిట్లా అన్నారు : 'ఈ సహోదరులిద్దరి మీదా నీకు ప్రేమ వున్నదా, వారి మార్గదర్శకత్వాన్ని సంతోషంగా నీవు తలదాల్చుతావా'. నేను వెంటనే సమాధానం యిచ్చాను. 'అవును, నేను హృదయపూర్వకంగా వారిని ప్రేమిస్తున్నాను. 'అనాది నుండి అనంతం వరకు విస్తరించివున్న యీ సహోదరత్వంలో చేరాలనీ నీవు ఆభిలషిస్తున్నావా' అని వారు అడిగారు. 'నేను అర్హుడనైనప్పుడు చేరాలని కోరుకుంటున్నాను' అని నేను చెప్పాను. 'ఈ సహోదరత్వం యొక్క లక్ష్యం ఏమిటో నీకు తెలుసా' అని వారు అడిగారు. 'లోకానికి వుపకారం చేయడం ద్వారా లోగోస్ సంకల్పాన్నీ నెరవేర్చడం' అని నేను సమాధానమిచ్చాను. 'నీ జీవితమంతటినీ, నీ శక్తి అంతటినీ యికమీదట యీ పనికోసమే అంకితం చేస్తానని నీ మీద ప్రమాణం తీసుకోగలవా, లోకక్షేమం కోసం నిన్ను నీవు సంపూర్ణంగా మరిచిపోగలవా, ప్రేమ స్వరూపుడైన పరమాత్మవలె నీవూ జీవితాన్ని ప్రేమమయం చేసుకోగలవా' అని అడిగారు. నేను :- 'తప్పక చేస్తాను, పరమ గురువుల సహకారంతో' అని సమాధాన మిచ్చాను. వారు యింకా యీ విధంగా అన్నారు : 'రహస్యంగా వుంచమని నీకు తెలిపిన విషయాలను రహస్యంగా వుంచుతానని వాగ్దానం చేస్తావా?', 'వాగ్దానం చేస్తాను' అని నేను సమాధానమిచ్చాను.”
ఈ కార్యక్రమంలో, తన జీవితకాలమంతా స్వేచ్చా, అన్వేషణల పక్షం వహించి, వాటి ప్రాధాన్యాన్ని చాటి చెప్పిన కృష్ణమూర్తి పూర్తిగా వాటికి వ్యతిరేకమైన దాసత్వం, గోప్యత అనే వాటికి వాగ్దత్తం కావడం కనబడుతుంది.
ఆ మరుసటి సంవత్సరం ఒక అధ్యయన సంస్థకు అతనిని అధిపతిగా చేశారు. త్వరలోనే అది ఒక అంతర్జాతీయ సంస్థగా ఎదిగింది. దాని పేరు ప్రాచ్యతార ('ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ యిన్ ది యీస్ట్'). శ్రీమతి బెసెంటు, లెడ్ బీటరు అతని చుట్టూ నిర్మిస్తున్న సంపన్న వాతావరణానికి యిది కేంద్ర బిందువు. నూతనమైన వీరి యీ అవతార సంబంధిత విశ్వాసం గురించి ప్రశంసాత్మకమైన వర్ణన చేస్తాడు జార్జి అరండేల్,
'మా నాయకుడు అధిష్టించిన స్థాయి మీకు తెలుసా. మా బృందంలోని సభ్యులకు ఆమె, శ్రీ లెడ్ బీటరు యీ లోకంలో వుండవలసిన జీవితా దర్శాలకు నిదర్శనాలు. వారిని మనం విశ్వసించి, అనుసరించిన కొద్దీ, అంత వేగంగానూ మనమూ అభివృద్ధి సాధించగలుగుతాము, వుత్తమమైన సేవలను అందించే గలుగుతాము... ఇప్పుడు మన ప్రపంచం గొప్ప ఆందోళనా కాలాన్ని ఎదు