144
కృష్ణమూర్తి తత్వం
ఇక అక్కడి నుండి 'వున్నది' నీ అవగాహన చేసుకోవడం ఆరంభించండి. అయితే చివరకీ ఒక గమ్యస్థానం చేరుకోవడం కోసం కాదు. గమ్యమూ, లక్ష్యమూ అనేవి 'వున్నది' కి ఎప్పుడూ చాలా దూరంలో వుంటాయి. 'ఉన్నది' అంటే మీరే. అంటే ఒక ప్రత్యేక సమయంలో కాదు, ఒక రకమైన స్థితిలో వున్నప్పుడూ కాదు; ఒక్కొక్క క్షణంలోను మీరు ఎట్లా వుంటారో ఆ మీరు. మిమ్మల్ని మీరే నిరసించుకోకండి, నిరాశగా చూస్తూ కూర్చోనవద్దు. ఏ తాత్పర్యాలూ చెప్పుకోకుండా ‘వున్నది' యొక్క కదలికను జాగరూకతతో చూస్తూ వుండండి. ఇది చాలా కఠినమైన పనే. కానీ అందులో ఎంతో ఆనందం వున్నది. స్వేచ్ఛగా వున్నవారికే ఆనందం లభిస్తుంది; 'ఉన్నది' అనే సత్యంతో పొటుగా మాత్రమే ఆ స్వేచ్ఛ లభిస్తుంది.
(కమెంటరీస్ ఆన్ లివింగ్)
కోపం
అంత ఎత్తుమీద వున్నా వేడి మహా తీవ్రంగా వుంది. గాజు కిటికీ తలుపులనీ చేత్తో తాకి చూస్తే కాలుతున్నాయి. విమానాన్ని నడిపిస్తున్న యంత్రాల చప్పుడు జోలపాటలాగా వున్నది. చాలా మంది ప్రయాణీకులు కునుకు తీస్తున్నారు. నేల మాకు కిందగా, చాలా దూరంలో వుంది; బాగా వేడెక్కి తళతళమని మెరుస్తున్నది. అంతా మట్టినేలే, అక్కడక్కడ మాత్రం కాస్త పచ్చపచ్చగా కనిపిస్తున్నది. ఇంకాసేపయాక విమానం ఆగింది. ఇప్పుడు వేడి మరీ భరించలేనంతగా ఎక్కువైంది. నిజంగానే చాలా బాధాకరంగా వుంది. నీడలోకి వెళ్ళాక కూడా తలకాయు బ్రద్దలవు తుందేమోననిపించేంత వేడి. నడి వేసంకాలం అవడంతో ఆ ప్రాంతం అంతా దాదాపు ఎడారిలాగా వుంది. మళ్ళీ అందరం విమానం ఎక్కాం. చల్లని గాలులు వెతుక్కుంటూ విమానం యింకా ఎత్తులకి ఎగరడం ఆరంభించింది. ఇప్పుడు యిద్దరు కొత్త ప్రయాణీకులు ఎదురుగుండా కూర్చున్నారు. బాగా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు వినకుండా వుండటం శక్యంకాని పని. ముందు కొంచెం మెల్లగానే మొదలు పెట్టారు. ఆ పైన వాళ్ళ కంరాల్లో కోపం ప్రవేశించింది. ఎంతోకాలంగా పరిచయమూ, లోలోపల విరోధమూ వుండటంవల్ల వచ్చే కోపం అది. వాళ్ళ వుద్రేకంలో తక్కిన ప్రయాణీకుల సంగతే మరిచినట్లున్నారు. వాళ్ళిద్దరూ ఎంత ఆందోళనలో మునిగి వున్నారంటే తక్కిన ప్రపంచపు వునికినే పట్టించుకోవడం లేదు.