Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

కృష్ణమూర్తి తత్వం

ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వివాహం చేసుకోగలను. వీటిలో ఏవీ నా భయానికి కారణాలు కావని నాకు స్పష్టంగా తెలుస్తున్నది. అసలు కారణం ఏది?'

మనిద్దరం కలిసి కనిపెడదాం. అది యిదీ అని నేను మీకు చెప్పచ్చు. కానీ అప్పుడది మీరు స్వయంగా కని పెట్టినట్లుగా వుండదు. మాటల స్థాయిలోనే వుంటుందీ. కాబట్టి దానివల్ల వుపయోగం ఏదీ వుండదు. అది తెలుసుకోవడం మీ స్వంత అనుభవంగా వుండాలి. అదే అన్నింటికంటే అసలు ముఖ్య విషయం. కనిపెట్టడం అంటే అనుభవం. మన యిద్దరం కలిసి అది కని పెడదాం. మీ భయం వీటిలో ఏవైనా పోగొట్టుకుంటానేమో అన్నదానిని గురించి కాకపోతే, బాహ్యమైన భద్రతాలేమిని గురించి కూడా మీ భయం కాకపోతే, యిక మీ ఆదుర్దా దేన్ని గురించి? వెంటనే సమాధానం చెప్పేయకండీ, వింటూ వుండండి, అంతే. అప్రమత్తంగా వుండి కనిపెట్టాలి మీరు. భౌతికమైన భద్రతారాహిత్యం కారణంగా మీరు భయపడటంలేదని బాగా గట్టిగా చెప్పగలరా? ఇటువంటి విషయాల్లో ఎంతవరకు నిశ్చయంగా చెప్పగలమో అంతమేరకు. మీ భయం యీ విషయంలో కాదు అని అంటున్నారు. ఇవి వట్టి మాటలు కావు అని కూడా మీరు గట్టిగా అంటున్నారు. ఇక అప్పుడు మీరు భయపడుతున్న అసలు విషయం ఏమిటి?

'భౌతికమైన భద్రతారాహిత్యం నా భయానికి కారణం కాదు. అందులో నాకు ఏ మాత్రం సందేహం లేదు. పెళ్ళి మేము ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. మాకు కావలసినవన్నీ పున్నాయి. కేవలం వస్తుసంపద పోగొట్టుకుంటానేమో అన్నదాని కంటే భిన్నమైనదేదో నన్ను భయపెడుతున్నది. అయితే అది ఏమిటి?'

అదే కనిపెడదాం. అయితే ప్రశాంతంగా అన్నీ పరిశీలిద్దాం. నిజంగానే యిది కనిపెట్టాలని మీకు వున్నది, వున్నదా లేదా?

'తప్పకుండా వున్నది. ఇప్పుడు యింతదూరం యీ విషయంలో ప్రయాణించాక యింకా గట్టిగా అనిపిస్తున్నది. దీనిని గురించి నేను భయపడుతున్నాను?'

అది కనిపెట్టాలంటే మనం ప్రశాంతంగా, అప్రమత్తంగా వుండాలి. ఏ మాత్రం ఒత్తిడి ప్రయోగించకూడదు. భౌతికమైన భద్రతాలేమి గురించి మీరు భయపడటం లేదు. సరే, అప్పుడు అంతర్గతంగా భద్రత లేదని భయపడుతున్నారా? మీరే నిర్దేశించుకున్న ఒక గమ్యాన్ని అందుకోలేరేమోనని భయమా? సమాధానం చెప్పకండి. వినండి, అంతే, ఏ గొప్పతనమూ సాధించలేని అసమర్థుడిని అని మీరు భావిస్తున్నారా? బహుశ మీలో ఆధ్యాత్మిక సంబంధమైన ఒక ఆదర్శం ఏదయినా వున్నదేమో. ఆ