రచనలు
141
మీ పేరును గురించి మీరు లెక్కచేయకపోయినా, మీ ఆస్తిపాస్తులన్నీ భద్రంగా వున్నా ఇప్పుడు కూడా మీలో ఏదో భయం వుంటుంది కదూ? అసలు మీరు- అంటే అర్థం ఏమిటి? మీ పేరు, మీ ఆస్తిపాస్తులు, మీరు అనే వ్యక్తి, మీ ఆలోచనలు వీటితోనేగా మిమ్మల్ని గుర్తించేది; ఏదో ఒకదానికి సంబంధించినవారుగా, ఫలానా వారు, ఫలానా వీరు అనీ గుర్తించడం, ఒక ప్రత్యేకమైన సమూహానికో, దేశానికో చెందినవారుగా ముద్ర వేసుకోవడం మొదలైనవి. ఈ ముద్రను పోగొట్టుకుంటానేమోననీ మీ భయం. అంతేనా?
'అంతే. అది లేకపోతే నేను ఎవర్ని? అంతే, అదే అసలు సంగతి'.
కాబట్టి, మీరు అంటే మీ స్వాధీనంలో వున్న మీ సంపదలు, మీ పేరు ప్రఖ్యాతులు, మీ కారు మొదలైన మీ ఆస్తులు, మీరు పెళ్ళిచేసుకోబోయే ఆ అమ్మాయి, మీలో వున్న ఆకాంక్షలు. మీరు అంటే యీ విషయాలే. ఈ విషయాలతో పాటు కొన్ని లక్షణాలు, కొన్ని విలువలు కూడా చేరి, మీరు అంటున్న యీ 'నేను' ను తయారు చేస్తున్నాయి. ఈ మొత్తం అంతా కలిపితే అదీ మీరు. దీనిని పోగొట్టుకుంటానేమో అనే మీ భయం. పోగొట్టుకోవడం అనేది అందరికీ జరిగినట్టే మీకూ జరిగే అవకాశం వుంది. యుద్ధం రావచ్చు, విప్లవం రావచ్చు. వామపక్షపు ప్రభుత్వం ఏర్పడచ్చు. ఈ రోజు కాని, రేపు కొని ఏదైనా జరిగి, మీకున్నవన్నీ పోవడం జరగచ్చు. అయితే భద్రతాలేమి అంటే యింతభయం ఎందుకు? భద్రతా రాహిత్యం చాలా సర్వ సహజమైన లక్షణం కాదూ? ఈ భద్రతారాహిత్యం నుండి రక్షించుకోవడానికి మీరు గోడలు నిర్మించుకుంటున్నారు. కాని యీ గోడలు కూడా పడిపోవచ్చు, పడిపోతున్నాయి కూడా. కొంతకాలం పాటు దీనినుంచి మీరు దూరంగా పారిపోవచ్చు. కానీ భద్రతాలేమి అనే ప్రమాదం ఎప్పుడూ పొంచి వుంటూనే వుంటుంది. 'ఉన్నదాని' ని మీరు తప్పించు కోలేరు. మీకు యిష్టం వున్నా, లేకపోయినా భద్రతాలేమి అనేది వున్నది. అయితే దీని అర్థం మీరు యీ విషయంలో చేతులు ముడుచుకొని కూర్చోవాలని కాదు. అంగీకరించాలనీ కాదు, నిరాకరించాలనీ కాదు. మీరు యువకులు; మీరెందుకు భద్రతాలేమినీ గురించి భయపడాలి? 'మీరు యిట్లా వివరించి చెప్పారు కాబట్టి భద్రతలేమిని గురించి నేను భయపడటం లేదు. పనిచేయడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు. నేను చేస్తున్న వుద్యోగంలో రోజుకు ఎనిమిది గంటల 'పైగా పని వుంటుంది. నాకు పెద్దగా యిష్టంలేకపోయినా యిదే విధంగా కాలం గడిపివేయగలను. ఉహాఁ, ఆస్తి, కారు వగైరా పోతాయేమో అనే భయం లేదు నాకు. నేను ప్రేమిస్తున్న అమ్మాయిని నేను