Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృష్ణమూర్తి : వికాసోదయం

xix

చేస్తూవుండటం పిల్లలకు మంచిదని నారాయణయ్యను వొప్పించాడు. మగపిల్లలిద్దరికీ కొత్త బట్టలు కుట్టించారు. కొద్ది పింఛనుమీద జీవనం వెళ్ళదీస్తున్న వారి తండ్రి సమకూర్చలేని రకం ఆహారపదార్థాలు వాళ్ళకు తినిపించడం మొదలు పెట్టారు. వారి బ్రాహ్మణ సంస్కారానికి తగినట్లుగా పెంచుకున్న శిఖలు కత్తిరించి వేశారు. జుట్టు భుజాల వరకు పెంచి, వెనక్కు దువ్వి మధ్య పాపిళ్ళు తీయించారు. సైకిళ్ళు ఎక్కి తొక్కడం, ఆటల్లో పాల్గొనడం నేర్పించారు. ప్రతి వుదయమూ వారిని “సరే, రాత్రి మన కార్యక్రమాలను గురించి మీకు ఏవేం గుర్తున్నాయి” అని లెడ్ బీటరు ప్రశ్నించేవాడు. వాళ్ళు సిగ్గుపడుతూ వచ్చీరాని యింగ్లీషులో సమాధానాలు చెప్తుండేవారు. లెడ్ బీటరు 'జ్యోతిర్మండలంలో జరిగిన' ఆసక్తికరమైన విషయాలు మరికొన్ని చేరుస్తుండేవాడు.

నవంబరు నెల 1909 సం॥లో కృష్ణమూర్తికి శ్రీమతి బెసెంటును పరిచయం చేశారు. ఇది జరిగిన ఒక నెల లోపలే ఆమె అతనికీ, నిత్యానందకు వుపదేశదీక్ష యిచ్చీ రహస్యసాధన విభాగం లోనికి ప్రవేశ పెట్టింది. ఇది టీ ఎస్ (థియొసాఫికల్ సొసైటీ) లోని ఒక ఆంతరంగి బృందం. ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన యీ సభ్యులు ఆమెకు విధేయులుగా వుంటామని ప్రమాణాలు చేయాలి; జగద్గురువు రాక కోసం తమని తాము పూర్తిగా నిర్నిబద్దంగా అంకితం చేసుకోవాలి. ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకోని వారిని- అటువంటి వాళ్ళు చాలా మందే వుండేవారు. క్రింది తరగతిలోనే అంటే శిక్షణ తరగతిలోనే అట్టే పెట్టే సేవారు. దీనితో పాటు శ్రీమతి బెసెంటు ఆత్మిక పధము అనే మరొక సిద్దాంతాన్ని కూడా అమలు చేసింది. ఇందులో అయిదు క్రమానుగత దశలు వుంటాయి. దీక్ష ఆరంభదశనుండి ఔన్నత్య దశవరకు వున్న యి ప్రధాన కొలమానం మీదే సభ్యుల అర్హత నిర్ణయించబడుతుంది. ఆత్మిక పధంలో ఎవరెవరు ఏఏ ఆధ్యాత్మిక స్థాయిల్లోకి వచ్చారన్నది నిర్ణయించే అధికారం ఆమెకూ, లెడ్ బీటరుకూ మాత్రమే వున్నది.

లెడ్ బీటరు యిచ్చిన ఆదేశానుసారం శ్రీమతి బెసెంటు పిల్లలిద్దరూ తన గది పక్కనే వున్న గదిలో నివసించడానికి నారాయణయ్యను ఒప్పించింది. అక్కడ ఆవిడ వారికి యింగ్లీషు పుస్తకాలు చదివి వినిపించేది. వారికి యింగ్లీషులో మాట్లాడటం నేర్పిస్తూ వుండేది. మరికొద్ది కాలానికి లెడ్ బీటరు 'దివ్య శక్తులతో ఒక మహా దర్బారు' ఏర్పాటు చేశాడు. ఆ దర్బారులో దివ్యజ్ఞానంవారి పరమగురువుల్లో ఒకరైన కుతుమి కృష్ణమూర్తిని మైత్రేయభగవానుడి ముందు 'అత్యున్నతమైన యీ సహోదరత్వంలో ప్రవేశం కోసం అర్థిస్తున్న అభ్యర్థి' అంటూ సమర్పించాడు. కుతుమి పరమగురువుగా, లెడ్ బీటరు, శ్రీమతి బెసెంటు వున్నత పధంలో మార్గదర్శకులుగా కృష్ణమూర్తి