రచనలు
129
‘ఉన్నది' కి వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతున్నారు మీరు? నేను నివసిస్తున్న యిల్లు రణగొణధ్వనులతో నిండివుండచ్చు, మురికిగా వుండచ్చు, అక్కడ వున్న సామాన్లన్నీ పరమవికారంగా వుండచ్చు; మొత్తంమీద సౌందర్యం అనేది ఏమాత్రం అక్కడ లేకపోవచ్చు. కాని, అనేక కారణాలవల్ల నేను అక్కడే నివసించాలి. మరో యింటికి మారలేను. అటువంటప్పుడు సమస్య ఆమోదించడమా కాదా అన్నది కాదు; కళ్ళకి కనబడుతున్న వాస్తవాన్ని చూడటం గురించి. 'ఉన్నది' ని నేను చూడకపోతే, పూలనీ వుంచే ఆ కూజాను గురించో, ఆ కుర్చీ గురించో, ఆ చిత్రపటం గురించే విచారించి సుడిపడిపోతాను. అవే నా ఆరాటాలుగా మారతాయి. అప్పుడు మనుష్యులన్నా, నా పని అన్నా నాలో ఆగ్రహం పుట్టుకొస్తుంది. ఇదంతా పూర్తిగా వదిలేసి మళ్ళీ కొత్తగా నేను మొదలుపెట్టగలిగితే, అది వేరు. కానీ, నేను అట్లా చేయలేను. 'ఉన్నది' కి, అసలు వాస్తవానికి వ్యతిరేకంగా నేను తిరగబడటంవల్ల లాభం లేదు. ‘ఉన్నది' ని గుర్తించేక నా పాటికి నేను హాయిగా, తృప్తిగా వుండిపోవడం జరుగుతుందని అనుకోకండి. 'ఉన్నది' ని వప్పేసుకోవడం వల్ల, అది నాకు అవగాహన అవడమే కాకుండా, మనసు వుపరితలం పైన ఒక విధమైన నెమ్మది కూడా ఏర్పడుతుంది. ఉపరితల మానసం ప్రశాంతంగా లేనప్పుడే అది ఆరాటాల్లో- అవి నిజమైనవి కావచ్చు, కల్పితమైనవి కావచ్చు. వాటిల్లో పడి మునిగిపోతుంది. రకరకాలైన సంఘ సంస్కరణ ల్లోనో, మతానికి సంబంధించిన సూక్తులలోనో, పరమగురువులు, లోకరక్షకుడు, పూజాపునస్కారాలు మొదలైనవాటిల్లో చిక్కుకొని పోతుంది. ఉపరితల మానసం నెమ్మదిగా వున్నప్పుడే, అజ్ఞాతంగా లోపల వున్నది బయటపడటానికి అవకాశం వున్నది. అజ్ఞాతంగా లోపల వున్నది బయటపడి తీరాలి. అయితే వుపరితల మానసం ఆరాటాల బరువును, చింతల భారాన్ని మోస్తున్నప్పుడు దీనికి అవకాశం లేదు. ఉపరితల మానసం నిరంతరం ఏదో ఒక ఆందోళనలో వుంటూవుండటం వల్ల మనసు యొక్క పై పై పొరలకు లోలోపలి పొరలకు మధ్యన సంఘర్షణ అనివార్యం. ఈ సంఘర్షణను పరిష్కరించుకోనంత వరకు ఆరాటాలు ఎక్కువవుతూనే వుంటాయి. నిజంగా చూస్తే, మన సంఘర్షణల నుండి తప్పించుకొని పారిపోవడానికి మార్గాలే యీ ఆరాటాలు, పలాయనాలు అన్నీ ఒకటే రకం. అయితే వాటిలో కొన్ని మాత్రం సమాజానికి చాలా హానికరమైనవి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఈ ఆరాటాలు, లేదా మరో సమస్యలు ఏవైనా సరే, పోటి మొత్తం ప్రక్రియను గురించి మనం ఎరుకగా వున్నప్పుడే ఆ సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. బాగా విస్తృతమైన ఎరుక కలిగివుండాలంటే ఆ సమస్యను ఖండించడం గానీ, సమర్థించడం కానీ వుండకూడదు. ఆ ఎరుకలో ఎంపిక చేసుకోవడం వుండకూడదు. ఆ విధమైన