128
కృష్ణమూర్తి తత్వం
కారణాలు, ఆర్థిక సంబంధమైనవీ, మనోతత్వసంబంధమైనవీ రెండూ మనకి తెలుసు. అయినే పైశాచికత్వాన్ని, మన వినాశనాన్ని మనమే స్వయంగా ప్రోత్సహిస్తున్నాం. అసలు యీ కారణంకోసం అన్వేషించడానికి వెనకాల వున్న మన వుద్దేశ్యంలో అది కలిగించే ప్రభావాన్ని వదుల్చుకోవాలనే కోరిక వున్నది. ఈ కోరిక మారురూపంలో వున్న ప్రతిరోధభావం లేదా నిరసన భావం. నిరసన వున్నప్పుడు అవగాహన వుండదు. 'అయితే యిప్పుడు నేను ఏం చేయాలి?' అని అతను అడిగారు.
ఇటువంటి అలా అల్పమైన మూర్ఖమైన ఆరాటాలు మనసును ఎందుకు పట్టిపీడిస్తాయి? 'ఎందుకు' అని అడగడం అంటే, మీ లోపల కాకుండా ఎక్కడో వేరేగా వున్న ఒక కారణాన్ని మీరు అన్వేషించి పట్టుకోవడం అని కాదు అర్థం; మీ ఆలోచనా రీతులు ఎట్లా వున్నాయి అనేది మీరే తెరిచి తీసి చూసుకోవడం. కాబట్టి, ఎందుకు మనసు యీ విధమైన వ్యాపకాలతో నిండిపోతూవుంటుంది? మనసు కృత్రిమంగాను, డొల్లగాను, తుచ్ఛంగాను వుండటం వల్ల, తనకి ఆకర్షణీయంగా వుండే వాటిలోనే మునిగిపోయి వుండాలనుకుంటుంది; కాదూ?
“అవును” అని అతను సమాధానమిచ్చారు. 'అదే నిజమనిపిస్తున్నది. కానీ పూర్తిగా కాదు. ఎందుకంటే నేను బాగా లోతుగా ఆలోచించే రకం మనిషిని'.
ఈ ఆరాటాలు కాకుండా మీ ఆలోచనలు యింకా ఏఏ విషయాల గురించి వుంటూ వుంటాయి?
'నా వృత్తిని గురించి' అన్నారాయన. నేనొక బాధ్యతాయుతమైన పదవిలో వున్నాను. రోజంతా, ఒక్కొక్కసారి రాత్రివేళల్లో కూడా, నా వృత్తికి సంబంధించిన విషయాలని గురించిన ఆలోచనలతోనే మునిగిపోయివుంటాను. అప్పుడప్పుడు ఏవో చదువుతుంటాను, కానీ సమయమంతా దాదాపుగా నా వృత్తి ధర్మంలోనే ఎక్కువగా గడిచిపోతుంది'.
మీరు చేస్తున్న పని మీకు బాగా యిష్టంగా వుందా?
“ఇష్టమే. కాని పూర్తిగా తృప్తికరంగా లేదు. నా జీవితమంతో నేను చేస్తున్న పనిలో కొంత అసంతృప్తితోనే గడిచిపోయింది. అయినా కూడా నేను యిప్పుడున్న పదవిని వదులుకోలేను. నామీద కొన్ని బాధ్యతలున్నాయి. పైగా వయసు కూడా ఫైబడుతున్నది. నన్ను విసిగించేదల్లా యీ ఆరాటాలూ, నా పనిమీదా, మనుష్యుల మీదా రోజు రోజుకీ నాలో పెరిగిపోతున్న ఆగ్రహమూ. నేను ఎవ్వరిమీదా పెద్దగా దయ చూపించలేదు. భవిష్యత్తు అంటే తగని ఆందోళనగా వుంది. శాంతి అనేది ఎరగనే ఎరగను అని అనిపిస్తున్నది. నా పని నేను బాగానే చేస్తాను, కాని....'