పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రచనలు

125

గురించిన చింత లేకపోతే మనసు అయోమయంలో పడుతుంది. సమస్యలే మనసుకి ఆహారం, అవి ప్రపంచ సమస్యలవచ్చు, వంటింటివీ అవచ్చు; రాజకీయపువి, వ్యక్తిగతమైనవి, మత పరమైనవి, సైద్ధాంతిక సంబంధమైనవి ఏవయినా అవచ్చు. కాబట్టి సమస్యలు మనల్ని అల్పంగా, సంకుచితంగా తయారు చేస్తాయి. ప్రపంచ సమస్యలతో సతమతమవుతున్న మనసు ఎంత అల్పమైనదో ఆధ్యాత్మిక వున్నతి కోసం పాటుపడుతున్న మనసు కూడా అంతే అల్పమైనది. సమస్యలు మనసుని భయం అనే భారంతో నింపుతాయి. ఎందుకంటే సమస్యలు స్వీయాన్ని, 'నా'ని, 'నాది'ని యింకా బలంగా తయారవడానికి సహాయం చేస్తాయి. సమస్యలు లేనప్పుడు, విజయసాధనలూ, ఓటములూ లేనప్పుడు స్వీయం అంటే 'నేను' వుండదు.

'కానీ, స్వీయం అనేది లేకుండా ఎవరయినా జీవించగలరా? అన్ని చర్యలకూ అదే కదా మూలస్థానం?'

కోరికకు పర్యవసానంగా గానీ, స్మృతికి, భయానికి, సుఖానికి, బాధకి పర్యవసానంగా గాని చర్యలు జరుగుతున్నప్పుడు, ఆ చర్యలు తప్పకుండా సంఘర్షణను, గందరగోళాన్నీ, విరోధాన్ని పెంచి పోషిస్తాయి. అవి ఏ స్థాయిలో జరిగిన సరే, మన చర్యలన్నీ మన నిబద్దీకరణం ఫలితంగానే జరుగుతుంటాయి. ఒక స్పందన మన ప్రతిస్పందన అసంపూర్ణంగా వుండి, తగినంతగా లేకపోవడం సంఘర్షణను తప్పక కలిగించి తీరుతుంది. సమస్య అంటే అదే. అసలు సంఘర్షణే 'నేను' కు ఆకార స్వరూపాలనిస్తుంది. సంఘర్షణ అనేదే లేకుండా, అత్యాశ అనే సంఘర్షణో, భయం అనే సంఘర్షణో, గెలుపు కోసం సంఘర్షణో, అవి ఏవీ లేకుండా జీవించడం అసంభవమేమీ కాదు. అయితే యీ సంభావనీయతను ప్రత్యక్ష అనుభవం ద్వారా కనిపెట్టనంత వరకు అది అసలైన యదార్థం అవదు. కేవలం సైద్ధాంతిక రూపంలోనే వుంటుంది. 'నేను' యొక్క తీరుతెన్నులన్నీ అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే అత్యాశ అనేదే లేకుండా జీవించడం సాధ్యమవుతుంది.

'నాలోపల భయాలు వుండి, పోటీనీ అణచుకోవడం వలన నాకు చెవుడు వచ్చిందంటారా? చెవి భౌతిక స్వరూపంలో ఏ లోపమూ లేదని వైద్యులు గట్టిగా చెప్పారు. నా చెవులకు మళ్ళీ వినబడే శక్తి రావడానికి అవకాశం వున్నదా? నా జీవితకాలమంతా ఏదో ఒక రకంగా నేను అణచి తొక్కివేయబడుతూనే వున్నాను. నేను నిజంగా చేయాలని యిష్టపడినవి ఎన్నడూ చేయలేక పోయాను'.

అంతర్గతంగాను, బాహ్యంగాను కూడా అవగాహన చేసుకోవడం కంటే అణచివేయడమే సులభం, అవగాహన చేసుకోవడం చాలా కఠినమైన పని, ముఖ్యంగా