సందేహాలు, సమాధానాలు
119
అప్పుడు, అటువంటి మానసిక నిశ్చలత్వంలో ఏ ఆహ్వానమూ లేకుండానే సత్యమైనది ఆవిర్భవిస్తుంది. సత్యాన్ని మీరు ఆహ్వానించలేరు. అది అజ్ఞేయమైనది. ఇటువంటి నిశ్శబ్దంలో అనుభవం పొందుతున్నవాడు వుండడు. కాబట్టి అనుభవంలోకి వచ్చినదానిని దోచుకోవడం జరగదు. 'నా సత్యానుభవం' అంటూ జ్ఞాపకం పెట్టుకోవడం జరగదు. అప్పుడు కాలరహితమైనది అస్తిత్వంలోకి వస్తుంది. దానిని అనుభవం పొందినవాడు కాని, అనుభవాలను స్కృతిలో పెట్టుకొనేవాడు కాని కొలతలలో చెప్పలేడు. సత్యం అనేది ప్రతీ క్షణంలోను కలుగుతూ వుంటుంది. దానిని అలవరచుకోలేము, ఒక జ్ఞాపకంగా దానిని పోగుచేసి వుంచుకోలేము, దాచుకోలేము. అనుభవం పొందుతున్నవాడు వుండని ఒక ఎరుక కలిగినప్పుడు మాత్రమే అది వస్తుంది.
ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, IX వాల్యూమ్,
ఆంస్టర్డేమ్, 26 మే 1955.
ప్రశ్న : మీరు చెప్పేది వింటున్నప్పుడు మీరు చాలా చదివారనీ, సత్యాన్ని ప్రత్యక్షానుభవంలోకి తెచ్చుకున్నారనీ కూడా అనిపిస్తుంది. అటువంటప్పుడు జ్ఞానాన్ని ఆర్జించడం దోషమని మీరెందుకనుకుంటున్నారు?
కృష్ణమూర్తి : ఎందుకో చెప్తాను వినండి. ఈ ప్రయాణం ఒంటరిగా చేయ వలసినది. జ్ఞానాన్ని మీ వెంటపెట్టుకున్నప్పుడు అది ఒంటరి ప్రయాణం అవదు. గీతను, వుపనిషత్తులను, ఆధునిక మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని మీరు చదివివున్నట్లయితే, పండితుల దగ్గర మీ గురించిన సమాచారాన్ని, వాళ్ళ దృష్టిలో అసలు మీరు ఏం సాధించాలి అన్నదీ పోగుచేసుకున్నట్లయితే- ఆ జ్ఞానం ఒక ప్రతిబంధకంగా తయారవు తుంది. అమూల్యమైన సంపద వున్నది పుస్తకాల్లో కాదు, మీ లోపల, మీ మనసులోనే దాగివుంది. ఆ అమూల్యసంపదని కనిపెట్టడం మీ మనసుకొక్కదానికే చేతనవుతుంది. స్వీయజ్ఞానం పొందడం అంటే మీ మనసు తీరుతెన్నులు తెలుసుకోవడం; దానిలోని సూక్ష్మాసూక్ష్మాలను గురించి, వాటి అంతరార్థాలను గురించి ఎరిగివుండటం. దీనికోసం ఒక్క పుస్తకం కూడా చదవనక్కరలేదు. నిజం చెప్పాలంటే నేను యివేవీ చదవలేదు. చిన్న పిల్లవాడిగా వున్నప్పుడు, ఆ తరువాత కొంత వయసు వరకు యీ పవిత్ర గ్రంధాలనే వాటిని కొన్నింటిని యధాలాపంగా తిరగవేసివుండవచ్చు. అంతే తప్ప వాటిని ఎన్నడూ నేను అధ్యయనం చేయలేదు. అట్లా అధ్యయనం చేయాలని నాకు లేదు. అమూల్యమైనవన్నీ మరెక్కడో వుండటం వల్ల యిది చదవడం అంటే నాకు