పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

కృష్ణమూర్తి తత్వం

ప్రశ్న : మీ దృష్టిలో ఎరుక అంటే ఏమిటో దయచేసి వివరంగా చెప్తారా?

కృష్ణమూర్తి : కేవలం స్పృహగా వుండటం, అంతే, మీరు తప్పొప్పులు నిర్ణయం చేస్తూ వుండటం గురించీ, మీలో వుండే అపోహల గురించీ, మీ యిష్టాలను గురించీ, అయిష్టాలను గురించీ ఎరిగివుండటమే ఎరుక. ఏదయినా ఒక విషయాన్ని మీరు చూస్తుంటే, ఆ చూడటం మీద మీ పోల్చిచూడటం, ఖండించడం, తప్పొప్పులు తీర్మానించడం, విలువలు కట్టడం అనే వాటి ప్రభావం వుంటుంది. వీటన్నింటి పర్యవసానమే మీరు చూడటం, కాదంటారా?మీరు ఏదయినో చదువుతున్నప్పుడు, చదువుతూ వుండగానే తప్పొప్పులు నిర్ణయిస్తూ, విమర్శిస్తూ, ఖండిస్తూ, ఆమోదిస్తూ వుంటారు. ఎరుకగా వుండటం అంటే ఆ జరుగుతున్న క్షణంలోనే యీ తప్పొప్పుల నిర్ణయం, విలువలు బేరీజు వేయడం, అభిప్రాయాలు ఏర్పరచుకోవడం, సంప్రదాయ బద్ధత, సన్ముతమూ, నిరాకరించడమూ అనే యీ మొత్తం ప్రక్రియనంతా చూడటం.

సరే, యిదంతా లేకుండా ఎరుకగా వుండటం ఎవరికైనా సాధ్యమేనా? ప్రస్తుతం మనకు తెలిసిందల్లా విలువలు బేరీజు వేసే ప్రక్రియ ఒక్కటే. అది, ఆ విలువలు కట్టడం ఎట్లా వచ్చిందంటే మన నిబద్ధీకరణపు, మన నేపథ్యపు, మన మతపరమైన, నీతిపరమైన, మనం నేర్చిన విద్యకి సంబంధించిన ప్రభావాలు అన్నింటినీ మిళితం చేసుకోగా వచ్చిన ఫలితం అది. మన స్పృహ అని మనం అంటున్న అది మన జ్ఞాపకాల ద్వారా కలుగుతున్నది- 'నా' అనే జ్ఞాపకం, డచ్ వాడిని, హిందువుని, బౌద్ధుడిని, కేథలిక్ ని, మరొకరిని, మరొకరినీ అనే స్మృతి, 'నేను' అంటే- నా జ్ఞాపకాలు, నా కుటుంబం, నా ఆస్తిపాస్తులు, నా గుణగణాలు. అంటే పరికించడం, తప్పొప్పులు నిర్ణయించడం, విలువలు కట్టడం. మనం అప్రమత్తంగా కనుక వుంటే యివన్నీ మనకు చిరపరిచితమైనవే అని గ్రహించవచ్చు. సరే, యివన్నీ లేకుండా, 'నేను' లేకుండా ఎరుకగా వుండటం సాధ్యం కాదా? ఖండించడం లేకుండా కేవలం చూడటం, పరికించి చూడటం సాధ్యమవుతుందా? మనసులోని కదలికలను, మన స్వంత మనసును, తప్పొప్పులు నిర్ణయించడం లేకుండా, విలువలు కట్టడం లేకుండా, 'ఇది మంచి' 'ఇది చెడు' అంటూ ఖండించకుండా వూరికే పరిశీలించడం సాధ్యం కాదా?

నేను' లోనుండి వుత్పన్నమయే ఎరుక, అంటే విలువలు కట్టడాలతోను, తీర్పులు చెప్పడాలతోను కూడుకొని వున్న ఎరుక ద్వైదీభావాన్నీ, రెండు వ్యతిరేక భావాల మధ్య, 'వున్నది' 'వుండవలసినది' అనే రెండింటి మధ్య సంఘర్షణను సృష్టిస్తుంది. అటువంటి ఎరుకలో తప్పొప్పులు నిర్ణయించడం వుంటుంది, భయం వుంటుంది, విలువలు కట్టడం వుంటుంది; ఖండించడమూ, ఫలానాది అని