xvi
కృష్ణముర్తి తత్వం
ఒక కొత్త మతాన్ని వుద్యమ స్థాయిలో నిర్మించాలంటే కథలూ, గాధలూ, పూజా కర్మలూ, ఒక ప్రత్యేక సంఘానికి సంబంధించిన కట్టుబాట్లూ పెద్ద ఎత్తున సమకూర్చుకోవలసి వుంటుంది. ఇవన్నీ అంత త్వరగానూ, సులభంగానూ చేర్చడం సాధ్యంగాదు. అయినా కూడా, పందొమ్మీదో శతాబ్దపు చివరి సంవత్సరాల్లో, ఒక ప్రక్కన యూరప్ బలం పుంజుకొని విభిన్న జాతుల ప్రజలను తన వలసాధిపత్యం అనే ఛత్రం కిందికి తీసుకురాగా, ప్రాచ్య, పాశ్చాత్య అనే రెండు భిన్న సంస్కృతులనూ, విజ్ఞానశాస్త్రాన్ని, మతాలనూ ఒకదానికొకటి చేరుస్తూ గొలుసులను నిర్మించగలిగిన పుద్యమానికి ఒక చిన్న మార్గం తెరుచుకున్నది. విభిన్న పరిధుల్లో శాంతియుతమైన ఒక సహోదరత్వాన్ని నిర్మించే దివ్యజ్ఞాన సమాజపు కార్యక్రమం ప్రపంచం నలుమూలలనుండి అనేకులను ఆకర్షించి సభ్యులుగా చేర్చుకుంది.
ఈ ఆదర్శాలను అందుకోవాలనే వుద్దేశ్యంతో దివ్యజ్ఞాన సమాజంపైపు ఆకర్షితులైనవారిలో అనీబెసెంటు ఒకరు. ఈ వుద్యమంలో చేరే నాటికే యింగ్లండులోని ప్రగతి వాద, సాంఘిక వుద్యమాలలో చాలావరకు అన్నింటిలోనూ శ్రీమతి బెసెంటు పని చేసింది : మహిళా హక్కుల కోసం పోరాడింది, స్వేచ్ఛావాదులతోను, కార్మికోద్యమాలలోను పనిచేసింది; లండన్ స్కూలు బోర్డులో కార్యోత్సాహం గల సభ్యురాలిగా వుండేది. 1879 లో హెలెనా బ్లవటిస్కీ ప్రభావానికి లోను ఆయాక, హిందూ సనాతనత్వానికి, పాండిత్యానికి కేంద్రమైన వారణాసికి ఆమె వచ్చి చేరింది. అరవై ఏళ్ళ వయసు సమీపిస్తున్న పాశ్చాత్య మహిళకది నిజంగా సాహసకృత్యమే. వారణాసిలో నివసిస్తూ భారతదేశపు గతకాలపు సంపదలోనుండి ఒక నూతన సంస్కృతిని పునఃసృష్టి చేయడం కోసం ఆమె తన శక్తినంతా వినియోగించడం మొదలు పెట్టింది. సంస్కృత పండితుల సహాయంతో భగవద్గీతకు ఒక అనువాదాన్ని తయారు చేసింది. దేశంలోని పలుప్రాంతాలలో పాఠశాలలు, కళాశాలలు స్థాపించింది.
దివ్యజ్ఞాన సమాజాని (టి ఎస్) కి శ్రీమతి బెసెంట్ అధ్యక్షులుగా వున్నప్పుడే కృష్ణమూర్తి తండ్రి నారాయణయ్య ఆమెవద్ద గుమాస్తాగా పనిచేస్తానని వచ్చాడు. అప్పుడే ప్రభుత్వోద్యోగంనుండి రిటైరయాడాయన. ఉచిత భోజనం, వసతి ఏర్పాటు చేస్తే దానికి బదులుగా పనిచేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. 1909 లో నారాయణయ్య తన ముగ్గురు పిల్లలను, ఒక మేనల్లుడిని, వయసు పైబడిన పెత్తల్లిని తీసుకొని వచ్చి, టి ఎస్ ఆవరణకి బయటగా వున్న చిన్న కుటీరంలో నివసించడం సాగించాడు. దగ్గరలోనే మైలాపూరులో వున్న ఒక పాఠశాలలో కృష్ణమూర్తిని, అతని తమ్ముడినీ చేర్పించాడు.