పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పందేహాలు, సమాధానాలు

99

ప్రశ్న : మనం చనిపోయాక, యీ భూమిమీదే మళ్ళీ పుడతామా? మరో లోకంలోకి నిష్క్రమిస్తామా?

కృష్ణమూర్తి : ఇది మనందరిలోనూ చాలా ఆసక్తి రేకెత్తించే ప్రశ్న, చిన్న వారిలో పెద్దవారిలో కూడా కాదంటారా? అందువల్ల కొంచెం లోతుగా దీనిని విశదపరుస్తాను. ఇప్పుడు నేను చర్చించబోతున్న యీ విషయాన్ని, కేవలం అందులోని శబ్దాలనే కాకుండా, అందులో వున్న అసలైన ఆ అనుభూతిని కూడా దయచేసి గ్రహించమని మీకు మనవి చేస్తున్నాను.

మరణం అనే ఒకటి వున్నదని మనకందరికీ తెలుసు. ముఖ్యంగా వృద్ధులకు తెలుసు. పరిశీలించే దృష్టి వున్న చిన్నవారికీ తెలుసు. 'అది వచ్చేదాకా ఆగి, అప్పుడు దాని సంగతి తేల్చుకుందాం' అని చిన్నవాళ్ళు అంటుంటారు. పెద్దవాళ్ళు మరణానికి సమీపంగా వచ్చేశారు కాబట్టి రకరకాల వుపశమన వర్గాలు వెతుక్కుంటూ వుంటారు.

దయచేసి యిది అర్ధంచేసుకొని మీకు మీరే అన్వయించుకోండి, మరొకరి మీద రుద్దకండి. ఎప్పుడో ఒకరోజు చనిపోతారని తెలుసు కాబట్టి దాన్ని గురించి కొన్ని సూత్రాలు మీరు తయారుచేసి పెట్టుకుంటారు. అవునా? దేవుడి మీద నమ్మకం పెంచుకుంటారు. పునరుత్థానాన్నో, కర్మనో, పునర్జన్మనో నమ్ముతారు. ఇక్కడో, మరో లోకంలోనో మళ్ళీ జన్మిస్తామని మీరు అనుకుంటారు. లేకపోతే మరణం అనివార్యమనీ, ప్రతివారూ చనిపోవలసిందే ఆనీ చావుని గురించి హేతువాదం చేస్తారు. చెట్టు వాడి, ఎండి పోతుంది. భూమిని సారవంతం చేస్తుంది. మళ్ళీ యింకో కొత్త చెట్టు పెరుగుతుంది. మీ నిత్య జీవనపు విచారాల్లో, ఆందోళనల్లో, అసూయల్లో, యీర్ష్యల్లో, మీ పోటీలలో, మీ సిరిసంపదల్లో తలమునకలుగా మునిగిపోయి కనుక మీరు వుంటే మరణం గురించి ఆలోచించే వ్యవధానం కూడా వుండదు. అయితే మీ మనసు లోపలగా అది వుండే వుంటుంది. చేతనంగానో, అచేతనంగానో అది అక్కడ లేకుండా వుండదు.

ముందుగా, చావుని గురించి మీరు వంట పట్టించుకున్న నమ్మకాలను, హేతువాదాలను, వుపేక్షాభావాన్ని అన్నింటినీ వదుల్చుకోగలరా? ఈ క్షణంలోనే వాటన్నింటి నుండి మిమ్మల్ని విముక్తి చేసుకోగలరా? అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, జీవిస్తూ వుండగానే, పూర్తి చైతన్యంతో వున్నప్పుడే, చురుకుగా, ఆరోగ్యంగా వున్నప్పుడే మరణ గృహంలో ప్రవేశించడం. చావు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ కూర్చోవడం కాదు. అది ఒక్క రెప్పపాటులో మిమ్మల్ని ఏ ప్రమాదంలోనో ఎతుకు పోవచ్చు. లేదూ జబ్బు చేసి తీసుకుంటూ, మెలిమెల్లిగా అచేతనావస్థలోకి మీరు