Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

కృష్ణమూర్తి తత్వం

కాబట్టి కోరికను 'నా' తో కలిసి కాకుండా వేరుగా వున్నదని అనుకుంటూ మనం చూస్తున్నంతవరకు సంఘర్షణ తప్పదు. 'నా' లేకుండా కోరిక వుండదు. నేనే కోరిక అవి రెండూ విడివిడిగా లేవు. దయచేసి యిది గ్రహించండి. భయం అంటే నేనే అనీ, దురాశ అంటే 'నేనే' అనీ, అవీ నేనూ ఒకటే తప్ప విడి విడిగా వుండమనీ గ్రహించినప్పుడు కలిగే ఆ భావం చాలా బ్రహ్మాండమైన అనుభవం.

ఆలోచించేవాడు లేనప్పుడు ఆలోచన వుండదు. ఆలోచన అంటూ వున్నంతవరకు ఆలోచించే వాడూ వుంటాడు. ఆలోచించేవాడు, ఆలోచన విడివిడిగా లేరు. అయితే ఆలోచనే ఆలోచించేవాడిని సృష్టిస్తున్నది. అతన్ని వేరుగా విడదీస్తున్నది. ఎందుకంటే ఆలోచన నిరంతరంగా శాశ్వతత్వం కోసం ఆరాటపడుతుంటుంది, అందుకని 'నేను' ను శాశ్వతంగా వుండే ఒక సత్వంగా సృష్టిస్తుంది. ఆ 'నేను' ఆలోచనను అదుపులో వుంచుతుంది. అయితే ఆలోచన లేకుండా 'నేను' లేదు. మీరు ఆలోచించకుండా వున్నప్పుడు, ఫలానా అని గుర్తిస్తూ లేనప్పుడు, విచక్షణ చేస్తూ లేనప్పుడు యీ 'నేను' అన్నది వుంటుందా? అప్పుడు యీ 'నా' వుంటుందా? ఆలోచన అనే ప్రక్రియే 'నా' ను తయారు చేస్తున్నది. ఆ 'నా' యే మళ్ళీ ఆలోచనను నడిపిస్తుంది. అంతు లేకుండా యీ ప్రయాస అంతా యిట్లా సాగిపోతూనే వుంటుంది.

భయాన్నీ పూర్తిగా పోగొట్టుకోవాలనే వుద్దేశ్యం వుంటే, అప్పుడు భయం అంటే 'నేను', 'నేను' కాకుండా భయం అనేది విడిగా లేదు అనే సత్యాన్ని గ్రహించి తీరాలి. అదీ వాస్తవం. ఒక వాస్తవాన్ని ఎదుర్కొన్నప్పుడు చర్య జరుగుతుంది. యిది చేతన మానసం ద్వారా జరుగుతున్న చర్య కాదు; ఆ చర్యను ఎన్నుకోవడం లేదు, నిరోధభావం వల్లా ఆ చర్య జరగడం లేదు. అది సత్యం అనే చర్య. అటువంటప్పుడు మాత్రమే మనసును అన్ని రకాల భయాల నుండి విముక్తం చేయడం సాధ్యమవుతుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, VIIవాల్యూమ్,

బొంబాయి, 15 ఫిబ్రవరి 1953.

ప్రశ్న :నా లోపల ఎంతో సంఘర్షణ వుంది, ఎన్నో బాధలున్నాయి. ఈ బాధలకు గల కారణాలను గురించి, యీ బాధలను నివారించే మార్గాలను గురించి, వేల సంవత్సరాలుగా మనకు బోధిస్తూనే వున్నారు. అయినా అప్పుడు ఎట్లా వున్నామో యిప్పుడు అట్లాగే వున్నాం. ఈ బాధలు లేకుండా చేసుకోవడం సాధ్యమా?

కృష్ణమూర్తి : మనం బాధల్లో వున్నామనే స్పృహ ఎంతమందికి వున్నదంటారు? ఒక సిద్ధాంతం లాగా కాకుండా, నిజంగానే మీలో సంఘర్షణ వున్నదని మీరు