86
కృష్ణమూర్తి తత్వం
నవ్వులు). దయచేసి నవ్వకండి. మిమ్మల్ని నవ్వించడానికి, మీరు వినోదించడానికి చమత్కారంగా మాట్లాడటంలేదు. పూర్తిగా విభిన్నమైన, ఒక కొత్త విద్యావిధానం మనకి అవసరం కదూ?- కేవలం జ్ఞాపకశక్తిని వృద్ధి చేసుకునేది కాదు; పిల్లలకు ఒక కౌశలాన్ని నేర్పించేది కాదు; ఏదో ఒక వుద్యోగానికి, జీవనోపాధి గడించుకోడానికి వారిని తయారుచేసేది కాదు. వారిని నిజంగా తెలివిగల వారిగా చేసే విద్యావిధానం కావాలి. తెలివి అంటే యీ సమస్త ప్రక్రియను, జీవితం అనే సమస్త ప్రక్రియను ఆకళింపు చేసుకోవడం, జీవితంలోని ఒక చిన్న ముక్క గురించి తెలుసుకోవడం కాదు.
అసలు సమస్య నిజంగా యిదీ. మనం, అంటే పెద్దవాళ్ళం చిన్నపిల్లలు స్వేచ్ఛగా, సంపూర్ణమైన స్వేచ్ఛలో ఎదగడానికి తోడ్పడగలమా? అంటే అర్థం, పిల్లల యిష్టప్రకారం వాళ్ళని వదిలేయాలని కాదు. స్వేచ్చగా వుండటం అంటే ఏమిటో మనం అర్ధం చేసుకున్నాం కాబట్టి, స్వేచ్ఛ అంటే ఏమిటో పిల్లలు అర్థం చేసుకోవడానికి వారికి సహాయం చేయగలమా?
ప్రస్తుతం చదువు అంటే లొంగిపోయి వుండటానికి సిద్దపరిచే ఒక ప్రక్రియ. సమాజంలో వున్న ఒక రకమైన నమోనాకు అనుగుణంగా వుండేటట్లు పిల్లవాడిని తయారు చేయడం. అంటే, ఒక వుద్యోగం సంపాదించుకొని, నలుగురిలో మర్యాదస్థుడిగా పేరు తెచ్చుకొని, చర్చికి వెళ్తూ, తక్కినవారిలాగే వుండటం, చని పోయేదాకా యీ ప్రయాస పడుతూ వుండటం, అంతర్గతంగా స్వేచ్ఛగా వుండి, పెద్దవుతున్నకొద్దీ జీవితంలో వుండే సంక్లిష్టతలన్నీ ఎదుర్కోగలగడానికి అతన్ని మనం తయారుచేయడం లేదు. అంటే, ఆలోచించగలిగే శక్తిసామర్థ్యాలు యివ్వాలి తప్ప, అతను ఎట్లా ఆలోచించాలో నేర్పడం కాదు. దీనికి అవసరమైనది ఏమిటంటే ముందుగా అధ్యాపకుడు అధికారపు ఆధిపత్యాన్నుండి, అన్ని రకాల భయాలనుండి, జాతీయ భావాల నుండి, వివిధ నమ్మకాల నుండి, సంప్రదాయాల నుండి తన మనసును విముక్తం చేసుకోవాలి. అప్పుడే పిల్లలు మీ సహాయంతో, మీ వివేకంతో, స్వేచ్ఛగా వుండటం అంటే ఏమిటి, ప్రశ్నించడం అంటే ఏమిటి, తరచి శోధించడం అంటే ఏమిటి, కొత్తవి కని పెట్టడం అంటే ఏమిటి అనేవి అర్థం చేసుకుంటారు.
అయితే, చూడండి, అట్లాంటి సమాజం కావాలని మనం కోరుకోవడం లేదు. ఒక నూతన ప్రపంచం మనకి అక్కర్లేదు. పాత ప్రపంచమే మళ్ళీ పునరావృతం అవుతే చాలు మనకి. కాస్త రూపు మార్చుకొని, యింతకంటే యింకొంచెం బాగా, మరి కాస్త మెరుగు పెట్టుకొని వస్తే చాలు మనకి. పిల్లలు పూర్తిగా లొంగిపోయి వుండాలి