Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సందేహాలు, సమాధానాలు

85

రాజకీయాల్లో గాని, సమాజంలో గానీ, మత విషయాల్లో కానీ, ఏ గొప్పా లేకుండా సొమాన్యంగా వుండిపోవాలంటే మీకు భయం. కాబట్టి సెక్స్ ఒక సమస్య అవుతున్నది. ఈ విషయాలన్నింటిలోనూ మీరు కనుక తగ్గిపోయి వుండటానికి, సామాన్యులుగానే వుండటానికి వొప్పుకుంటే, అప్పుడు సెక్స్ అసలు సమస్యే కాదని మీరు గ్రహిస్తారు.

ప్రేమ వున్నప్పుడు మాత్రమే సౌశీల్యం వుంటుంది. ప్రేమ వున్నప్పుడు సెక్స్ ఒక సమస్య అవదు. ప్రేమ లేకుండా బ్రహ్మచర్యం అనే ఆదర్శాన్ని సాధించాలను కోవడం అసంబద్ధం. ఎందుకంటే ఆదర్శం నిజంకాదు, భ్రమ. మీరు ఏమిటో, అది నిజం. మీ మనసుని, మీ మనసు చేసే పనులని మీరే అవగాహన చేసుకోక పోతే సెక్స్ ని కూడా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే సెక్స్ మనసుకి సంబంధించినది. సమస్య అంత చిన్నదేమీ కాదు. కొన్ని అలవాట్లను అభ్యాసం చేసుకోవడం వల్ల ఏ లాభమూ జరగదు. తోటి మనుష్యులతో, ఆస్తిపాస్తులతో, సిద్ధాంతాలతో మీకుండే సంబంధ బాంధవ్యాలను గురించి అపారమైన ఆలోచన, లోతైన పరిశోధన అవసరం, సర్! దీని అర్థం ఏమిటంటే మీరు మీ హృదయాన్ని, మీ మనసును అత్యంతమైన కఠిన పరిశీలనకి గురి చేయాలి. ఆ విధంగా మీలో ఒక సంపూర్ణ పరివర్తనాన్ని తీసుకొనిరావడం జరుగుతుంది. ప్రేమ అంటేనే పవిత్రమైనది. ప్రేమ వున్నప్పుడు అంటే మనసు సృష్టించిన పవిత్రత అనే ఒక వూహ కాకుండా, నిజమైన ప్రేమ వున్నప్పుడు యీ సెక్స్ ఒక సమస్య అవదు. దాని అసలైన అర్థం చాలా భిన్నంగా వుంటుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, V వాల్యూమ్,

న్యూఢిల్లీ, 19 డిసెంబర్ 1948


ప్రశ్న : గందర గోళంగా వున్న యీ ప్రపంచాన్ని ఎదుర్కొని నిలబడాలంటే మా పిల్లలకి ఎటువంటి విద్యావిధానం వుండాలి?

కృష్ణమూర్తి : ఇది చాలా పెద్ద ప్రశ్న. అవునా కాదా? రెండు నిముషాల సమాధానం సరిపోదు. అయినా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. తరువాత ఎప్పుడయినా వివరాలలోకి పోవచ్చును. సమస్య పిల్లలకి ఎటువంటి విద్య వుండాలి అని కాదు; అసలు అధ్యాపకుడికే ముందు చదువు నేర్పించాలి, తల్లిదండ్రులకీ నేర్పించాలి అన్నది. (గుసగుసగా