కృష్ణమూర్తి : వికాసోదయం
xiii
కొంచెం పెరిగాక, మృదువైన హృదయమూ, వుదారగుణమూ గల బాలుడిగా తయారయ్యాడు. అయితే తరచూ మలేరియాతో తీసుకుంటూ బడికి సక్రమంగా వెళ్ళలేకపోయేవాడు. పారాలు సరిగ్గా నేర్చుకోలేక, తరగతిలో తక్కినవారికంటే వెనకబడి వుండేవాడు. ఉపాధ్యాయుల చేతిలో దెబ్బలు తినడం కూడా అప్పుడప్పుడు జరిగేది.
కృష్ణమూర్తికి చిన్ననాటి జ్ఞాపకాల్లో సంతోషకరమైనవి తల్లిని గురించినవే. అయితే అతనికి పదేళ్ళు నిండాయో లేదో తల్లీ, ప్రేమాస్పదురాలైన అక్కా యిద్దరూ చనిపోవడంతో నిశ్చింతగా సాగిపోతున్న ఆ కుటుంబ జీవనం ముగిసిపోయింది. ఆ సంఘటన జరిగిన ఎనిమిది సంవత్సరాల తర్వాత కృష్ణమూర్తి యిట్లా వ్రాసుకున్నాడు. '1905 లో మా అమ్మ చనిపోయాక మమ్మల్ని ప్రేమగా, మా బాగోగులు కనిపెడ్తూ చూసే వ్యక్తి నాకూ నా అన్నదమ్ములకూ లేకుండా పోయింది. మా నాన్నకు తన పనులతో తీరిక లేకపోవడం వలన మా గురించి అంతగా పట్టించుకొనేవాడుకాదు. నిజంగా చెప్పాలంటే మమ్మల్ని చూసుకోవడానికి ఎవ్వరూ వుండేవారుకాదు.'
మనిషి అంతఃప్రేరణల్లో కల్లా మతం గురించినది చాలా నిగూఢమైనది. శబ్దలక్షణ శాస్త్రాన్ని బట్టి చూస్తే “రిలిజియన్' అనే మాట యొక్క ధాతువుకి అర్ధం 'కలిపి వుంచేది' అని. ఒక దృష్టితో చూస్తే మతం స్త్రీ పురుషులను ఒక బహుళ జన సమాజంగా కట్టివేసి వుంచుతుంది. మరో స్థాయిలో అది వారిని కొన్ని దైవికమైన సిద్దాంతాలలో బంధించి వుంచుతుంది. చావు, పుట్టుక, యుక్తవయసులోకి ప్రవేశించడం, వివాహాలు మొదలైన ప్రధాన సంఘటనల సందర్భంలో పవిత్రమైన కర్మకాండల రూపంలో యివి వుంటాయి. ఆయా సందర్భాల్లో కలిగే భావోద్వేగాలలో ఆ సమాజంలోని అందరూ పాలు పంచుకుంటారు. అందరూ కలసి ప్రదర్శించుకుంటారు. జీవితంలో ఎదురయే పెద్ద పెద్ద మార్పుల సమయంలో తమ మనోభావాలను పదిమందితో కలిసి పంచుకోవడం వలన ఒంటరితనపు బాధ కొంత తట్టుకోవడం సాధ్యమవుతుంది. మతసంబంధమైన పాటలు, గాధలు, ఆచార కర్మలు మొదలైన వాటిలో ఆయా ప్రజల ఆందోళనలకు. విజయోత్సాహాలకు, భయాలకు, ఆశలకు సంబంధించిన సామూహిక స్మృతులు అభివ్యక్తమవడానికి అవకాశం వుంది. అజ్ఞాత నామధేయులైన మతగురువులు, కవులు, కళాకారులు యీ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఆయా మతాలను విస్తరింపజేసుకోవడానికీ, కొత్తవారిని చేర్చుకోవడానికీ చేసిన ప్రయత్నాల్లో ఒక భాగం ఏమిటంటే విశ్వాసమూ, క్రోడీకరించి సూత్రబద్ధం చేసిన నమ్మకాలూ, ఒక దశలో యివి ఒక్కొక్క మతపు ప్రత్యేక లక్షణాలుగా తయారయ్యాయి.