Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

కృష్ణమూర్తి తత్వం

ఏర్పరచడం కోసం వివాహం అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇరు పక్షాలలోను యీ శరీర సంబంధమైన వాంఛ వుంటుంది. అందువల్లనే మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. పిల్లల్ని కంటున్నారు. ఒక పురుషుడికో, ఒక స్త్రీకో జీవిత పర్యంతం మిమ్మల్ని కట్టి వేసుకుంటుంటారు. ఈ విధంగా సుఖాన్ని అందించడానికి ఒక శాశ్వతమైన ఏర్పాటూ, మీ భద్రతకు హామీ లభిస్తాయి. దీని ఫలితంగా క్రమక్రమంగా మీరు క్షీణించిపోతారు. అలవాటు అనే చక్రంలో పడి, జీవిస్తూ వుంటారు. అలవాటు అంటే క్షీణించి పోవడం. ఈ శరీర సంబంధమైన, సెక్స్ సంబంధమైన వాంఛను అవగాహన చేసుకోవాలంటే విశేషమైన తెలివి వుండాలి. అయితే యింత వివేకం మనలో కలిగేలా మనకి విద్యాబోధన చేయడంలేదు. కలిసి జీవితం గడపవలసిన పురుషునితో లేదా స్త్రీతో ఎట్లాగో ఒకలాగా నెట్టుకొని పోతుంటాం. 20, 25 ఏళ్ళ వయసులో నేను పెళ్ళి చేసుకుంటాను. ఇక తక్కిన జీవితకాలమంతా, ఆ స్త్రీ గురించి నాకు ఏమీ తెలియకపోయినో ఆమెతో నేను గడిపితీరాలి. ఆమెను -గురించి నాకు కాస్తయినా తెలియదు. అయినా జీవితాంతం ఆమెతో నేను జీవించాలని మీరు అంటున్నారు. వివాహం అనే పేరుతో మీరు పిలుస్తున్నది యిదేనా? నేను ఎదుగుతున్న కొద్దీ, పరిశీలిస్తున్న కొద్దీ, ఆమెకూ నాకూ మధ్య ఎన్నో వ్యత్యాసాలు కనిపిస్తుంటాయి. ఆమె వేరూ అనీ, ఆమె అభిరుచులు పూర్తిగా భిన్నమైనవనీ గ్రహిస్తాను. ఆమెకి క్లబ్బులకి వెళ్ళడం అంటే చాలా యిష్టం. నాకేమో గంభీరమైన విషయాల్లో ఆసక్తి; లేదూ ఆమెకి యిందులోనూ నాకు అందులోనూ ఆసక్తి, అయినా కూడా మీకు పిల్లలు కలుగుతారు. అదే యిందులో వున్న వింత. సర్! స్త్రీలవైపు చూస్తూ చిరునవ్వులు చిందించకండి. ఇది మీ సమస్య. సరే, నేనొక భాంధవ్యాన్ని స్థిరపరచుకున్నాను. దానిలోని విశిష్టత ఏమిటో నాకే తెలియదు. అదేమిటో నేను కనిపెట్టనూ లేదు, అవగాహనా చేసుకోలేదు.

చాలా చాలా కొద్దిమందికీ, ప్రేమించే వారికి మాత్రమే వివాహ బాంధవ్యానికి వున్న విలువ తెలుసు. వారికి అది విడదీయరానిది. కేవలం ఒక అలవాటు వంటిదో, ఒక సౌకర్యం వంటిదో కాదు. అది శరీర సంబంధమైన, సెక్స్ సంబంధమైన అవసరాల మీద ఆధారపడినది కాదు. ఏ నిబంధనలు లేని ఆ ప్రేమలో వ్యక్తిత్వాలు పూర్తిగా కలిసి ఒకటై పోతాయి. అటువంటి బాంధవ్యంలోనే వుపశాంతి లభిస్తుంది. ఆశ వుంటుంది. అయితే మీలో చాలామందిలో మీమీ వివాహా బాంధవ్యాల్లో యిటువంటి ఐక్యత వుండదు. వేరువేరుగా వున్న రెండు వ్యక్తిత్వాలు కలసి ఒకటై పోవాలంటే, మీమ్మల్ని మీరు తెలుసుకోవాలి, ఆమె తనని తాను తెలుసుకోవాలి. దీని అర్థమే