Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సందేహాలు, సమాధానాలు

79

తత్వం ఒకటి వున్నదంటేనే మనసు గందరగోళంగా అయిపోతుంది. వివరణలు అనేవి లేనప్పుడే, మాటలలో మనసు చిక్కుకొని పోనప్పుడే, ప్రేమ జనించడానికి ఆస్కారం వుంటుంది.

(ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, VI వాల్యూమ్,

లండన్, 15 ఏప్రిల్ 1952

ప్రశ్న : ఏ సమాజ వ్యవస్థలోనైనా వివాహం అన్నది తప్పక అవసరం. కానీ మీరు మొత్తం వివాహవ్యవస్థనే వ్యతిరేకిస్తున్నారు. దీనికి ఏమంటారు? దయచేసి యీ సెక్స్ అనే సమస్యను కూడా వివరించండి. ప్రస్తుతం వున్న అతి ముఖ్యమైన సమస్యల్లో యుద్ధం తరువాత స్థానాన్ని ది ఆక్రమిస్తున్నది. ఇది ఎందుకు యిట్లా తయారైంది?

కృష్ణమూర్తి : చాలా సునాయాసంగా ఒక ప్రశ్న అడగవచ్చు. అయితే అసలు సమస్యలో లోతులను చాలా జాగ్రత్తగా పరికించడమే ప్రయాసతో కూడుకున్న పని. అందులోనే సమాధానం వుంటుంది. ఈ సమస్యను అర్థం చేసుకోవాలంటే దానిలో పెనవేసుకొని వున్న ఎన్నో అంతర్గర్భితమైన వాటిని కూడా చూడాలి. మనకు వున్న సమయం చాలా కొద్ది కాబట్టి అది చేయడం కష్టం. అందుకని క్లుప్తంగా చెప్పవలసి వస్తున్నది, చాలా శ్రద్ధతో మీరు వినకపోయినట్లయితే అర్థంచేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. సమాధానాన్ని కాకుండా అసలు సమస్యనే తరచి విచారిద్దాం. ఎందుకంటే సమాధానం సమస్య లోపలే వున్నది తప్ప ఎక్కడో దూరంగా లేదు. సమస్యను స్పష్టంగా అర్థం చేసుకుంటున్న కొద్దీ, సమాధానం కూడా స్పష్టమవుతూ వుంటుంది. కేవలం సమాధానం కొరకే వెతికినట్లవుతే అది మీకు దొరకదు. ఎందుకంటే సమాధానం కోసం సమస్యకు అవతలగా ఎక్కడో వెతుకుతూ వుంటారు. వివాహాన్నే తీసుకుందాం. సైద్ధాంతికంగా కాదు, ఆదర్శంగా కాదు. అట్లాచూస్తే అది పరమ మూర్ఖత్వం. వివాహాన్ని ఒక ఆదర్శవాదంగా చేయవద్దు, ఉన్నదానిని వున్నట్లుగా చూద్దాం. అప్పుడే ఆ విషయంలో ఏదయినా చేయగలుగుతాం. అది ఒక పూలబాట అన్నట్లుగా చిత్రించుకుంటే యిక దానిని గురించి ఏ చర్యా తీసుకోలేము. దానివైపు పరికించి చూసి, వున్నదానిని వున్నట్లుగా కనుక చూస్తే, అప్పుడు చర్యతీసుకోవడం బహుశ సాధ్యపడవచ్చు.

సరే, వాస్తవంలో అసలు ఏం జరుగుతుంది? యౌవనంలో వున్నప్పుడు శరీర సంబంధమైన, సెక్స్ సంబంధమైన వాంఛ చాలా తీవ్రంగా వుంటుంది. దీనికి హద్దులు