పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సందేహాలు, సమాధానాలు

73

ప్రశ్న : మీరు వుపన్యాసాలు యిస్తూ ఎందుకు కాలాన్ని వృధా పుచ్చుతారు; దానికి బదులుగా ప్రపంచానికి క్రియాశీలకంగా ఏదయినా సహాయం చేయచ్చు గదా?

కృష్ణమూర్తి : సరే, 'క్రియాశీలకంగా' అంటే మీ అర్ధం ఏమిటి? ప్రపంచాన్ని మార్చివేసి, యింతకంటే మంచి ఆర్టికమైన సర్దుబాట్లను తేవడమా, మొత్తం సంపద పంపిణీని, సంబంధ బాంధవ్యాలను యింతకంటే మెరుగు పరచడమా? ఇంకా కఠినంగా చెప్పదలుచుకుంటే, మీకు ఒక మంచి వుద్యోగం వెదికి పెట్టడమా? ప్రపంచంలో మార్పు రావాలని మీరు కోరుకుటున్నారు- బుద్దివున్న ప్రతి మనిషీ అదే అనుకుంటున్నాడు. ఈ మార్పును తెచ్చే ఒక పద్ధతిని కోరుతున్నారు మీరు. ఆ విషయకంగా ఏదయినా చేయకుండా వుపన్యాసాలతో కాలాన్ని వృధాచేస్తున్నానని ఆకారణంగా అడుగుతున్నారు. సరే, నేను చేస్తున్నది నిజంగా కాలం వృధా చేయడమేనా? పొత సిద్ధాంతవాదాల స్థానంలో, పాత పద్ధతుల స్థానంలో ఒక కొత్త సూత్రావళిని నేను ప్రచారం చేస్తే అప్పుడది తప్పకుండా కాలం వ్యర్థం చేయడమే అవుతుంది, అవదూ? నేను చేయాలని మీరు కోరుకుంటున్నది బహుశ అదేనేమో? అయితే, ఆచరించడానికి, జీవించడానికి, మంచి వుద్యోగం సంపాదించడానికి, యింతకంటే మంచి లోకాన్ని నిర్మించడానికి మీరు చెప్తున్న క్రియాశీలకమైన ఒక విధానాన్ని సూచించడానికి బదులుగా, ఒక నిజమైన విప్లవం రాకుండా నిరోధిస్తున్న ప్రతిబంధకాలు అసలు ఏవి అనేది తెలుసుకోవడం ముఖ్యం కదూ! విప్లవం అంటే వామ పక్షంవైపుకీ కాదు, మరో పక్కకీ కాదు; మౌలికమైన, సమూలమైన విప్లవం; సిద్ధాంతాలమీద ఆధారపడినది కాదు, ఎందుకంటే, మనం ముందే చర్చించినట్లుగా ఆదర్శాలు, నమ్మకాలు, సిద్ధాంతవాదాలు, మూఢవిశ్వాసాలు అసలు చర్యకు ప్రతిబంధకూలవుతాయి. మన చర్యలు భావాల మీద ఆధారపడినంతవరకు ప్రపంచ పరివర్తన, విప్లవం జరగవు. ఎందుకంటే అప్పుడు కేవలం మరోదానికి ప్రతిస్పందనగా మాత్రమే కార్యాచరణ జరుగుతుంది. అందువల్ల కార్యాచరణ కంటే భావాలకే ప్రాధాన్యం ఎక్కువవుతుంది. ఇప్పుడు ప్రపంచంలో సరిగ్గా యిదే జరుగుతున్నది, అవును కదూ? కార్యాచరణ జరగాలంటే చర్యలను నిరోధించే ప్రతిబంధకాలు ఏమిటో మనం కనిపెట్టాలి. అయితే మనలో చాలామంది కార్యాచరణ కావాలనుకోవడం లేదు. అదీ మనకున్న క్లిష్టపరిస్థితి. అంతకంటే మనకి చర్చలు జరపడం, ఒక సిద్ధాంతాన్ని తోసేసి, దాని స్థానంలో మరో సిద్ధాంతం పెట్టడమూ యిష్టం. ఆ విధంగా కార్యాచరణ చేయకుండా సిద్ధాంతాలను పట్టుకొని పారిపోతాం. ఇదంతా చాలా స్పష్టంగానే వుంది కదా, వుందా లేదా? ప్రస్తుత సమయంలో ప్రపంచం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నది. జనాభా పెరుగుదల, ఆకలి చావులు, జాతులుగా వర్గాలుగా ప్రజల్లో