సందేహాలు, సమాధానాలు
71
అదంతా కేవలం తప్పించుకోవడం, యదార్థాన్నుండి పారిపోవడం. అది కూడా సమష్ఠిగా నివసించే సహజీవన సంఘాల్లో చేరి కలసిపోవడం లాంటిదే, బోలెడు ఆశ్రమాలు, ఆస్తులూ వున్న గురువును చేరి అందులో పడి మునిగిపోవడం వంటిదే. వీళ్ళంతా నిత్యజీవితపు సమస్యలని పరిష్కరించుకోరు. సమాజంలో రావలసిన మార్పు, మానసికమైన విప్లవాల గురించి లోతుగా శోధించరు. వీటినుంచి పారిపోతారు. ఇక మనం, మనమూ తప్పించుకొని పారిపోకుండా, యీ వున్న ప్రపంచంలోనే నిజంగా జీవిస్తుంటే, అప్పుడు మనం ఏం చేయాలి? మన జీవితాల్ని మార్చుకోగలమా? మొత్తం జీవితంలో సంఘర్షణ అనేది లేకుండా చేసుకోగలమా, ఎందుకంటే సంఘర్షణ కూడా హింసలో ఒక భాగమే- అది సాధ్యమేనా? మన జీవితాలకు ఆధారం ఏమిటీ అంటే ఏదో ఒక గొప్పదనాన్ని సాధించాలనే పోరాటం; ప్రయాసా, పోరాటమూ.
ఈ ప్రపంచంలో నివసిస్తున్న మనుష్యులం మనం- మనల్ని మార్చుకోగలమా? అదే అసలైన ప్రశ్న - సమూలంగా, మనో తత్వంలోనే పరివర్తన తీసుకొనిరాగలమా? కాలక్రమేణా వచ్చే పర్యవసానంగా కాదు, కాలానికి కట్టు బడకుండా, లోతుగా ఆలోచించేవారికి, నిజమైన ఆధ్యాత్మికులకు రేపు అనేది వుండదు. రేపు లేదు అని అనడం చాలా కరినవాక్యం. ఇవాల్టి రోజును సంరంభంతో పూజించడం అన్నది మాత్రమే వుంది. ఈ జీవితాన్ని ప్రతిరోజూ, పరిపూర్ణంగా, యదార్థంగా జీవించగలమా, మన బాంధవ్యాలలో పరివర్తన తేగలమా? అసలు సమస్య ఆదీ, ప్రపంచం ఎట్లా వుంది అన్నది కాదు. ఎందుకంటే ప్రపంచం అంటే మనమే. దయచేసి యిది గ్రహించండి : ప్రపంచం అంటే మీరు, మీరు అంటే ప్రపంచం. ఇది స్పష్టంగా కనబడుతున్న, భయంకరమైన వాస్తవం. అసాంతంగా ఎదుర్కోవలసిన ఒక పెద్ద సమస్య- అంటే ఎంతో ఆసహ్యమైనవన్నీ కలిగివున్న యీ లోకం అంటే మనమే అనీ, మనకీ అందులో భాగస్వామ్యం వుందనీ, యిదంతా యిట్లా వుండటంలో బాధ్యత మనమీద కూడా వున్నదనీ, మధ్య ప్రాచ్యంలో జరుగుతున్నదానికి, ఆఫ్రికాలో జరుగుతున్నదానికి, ప్రపంచమంతటా జరుగుతున్న మతిలేని వ్యవహారాలన్నింటికీ మనమూ బాధ్యులమేనని గ్రహించడం. మన తాతలు, మన ముత్తాతలు చేసిన క్రియలకు- బానిసత్వం, వేలకొద్దీ యుద్ఘాలు, సామ్రాజ్యాల్లోని క్రూరత్వం- మనం బాధ్యులం కాకపోవచ్చును కానీ మనమూ అందులోని వాళ్ళమే. మన బాధ్యతను మనం గ్రహించకపోతే, అంటే మన సమస్త బాధ్యతను, మనం చేసే పనులకు, ఆలోచనలకు, ప్రవర్తనకు మన బాధ్యతను మనం గుర్తించకపోతే, అప్పుడు బొత్తిగా ఏ ఆశా లేనట్లే, లోకం సంగతి తెలుసు కాబట్టి వ్యక్తిగతంగా, విడివిడిగా మనం యీ వుగ్రవాదపు సమస్యను పరిష్కరించలేమని తెలుసు కాబట్టి. అదీ ప్రభుత్వాల సమస్య. పౌరులకు భద్రత, రక్షణ కల్పించడం వారి విధి. అయితే అది వారు లక్ష్య పెట్టడంలేదు.