10
కృష్ణమూర్తి తత్వం
ప్రశ్న : మా అందరిలోనూ ఏదో భయాలు యుద్ధాన్ని గురించో, పుద్యోగం కనుక వుంటే అది పోతుందేమోననో, వుగ్రవాదులనీ గురించో, మా పిల్లలలో కనబడుతున్న దౌర్జన్యం గురించో, అప్రయోజకులైన రాజకలయవేత్తల పాలిట పడ్డామే ఆనో- యిట్లా రకరకాల భయలు మా జీవితాలను ఎప్పుడూ కళవళ పెడుతూవుంటాయి. ఇటువంటి యీ జీవితాన్ని మేము ఏవిధంగా ఎదుర్కోవాలి?
కృష్ణమూర్తి : ఎట్లా ఎదుర్కొంటారు? ప్రపంచం రోజు రోజుకూ హింసాపూరితంగా తయారవుతున్నదనే విషయం మనం వొప్పుకొని తీరాలి. అది స్పష్టంగా కనబడు తున్నది. యుద్ధ ప్రమాదం కూడా స్పష్టంగా కనబడుతూనే వున్నది. మన పిల్లలు హింసాత్మకంగా తయారవుతున్నారనే ఒక కొత్త వైపరీత్యం కూడా మన కళ్ళముందు వున్నది. కొంతకాలం కిందట భారతదేశంలో పిల్లలతల్లి అయిన ఒకావిడ మా వద్దకు రావడం గుర్తుకొస్తున్నది. భారతీయ సంప్రదాయం ప్రకారం తల్లి అంటే చాలా గౌరవనీయమైన స్థానంలో వుండే వ్యక్తి. ఈ తల్లిని తన పిల్లల ప్రవర్తన దిగ్ర్భాంతిలో ముంచింది. పిల్లలు ఆమెని కొడుతున్నారట- భారతదేశంలో కనీ వినీ ఎరగని సంగతి. అంటే యీ హింస, దౌర్జన్యం ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయి. ఇక యీ ప్రశ్న ఆడిగినవారు ఉన్నట్లుగా వుద్యోగం పోతుందనే భయం ఒకటి వున్నది. ఇవన్నీ చూస్తు, యిదంతా తెలిసి, ప్రస్తుతం యిట్లా వున్న యీ జీవితాన్ని మీరు ఏవిధంగా ఎదుర్కోవాలి?
నాకు తెలియదు. నేను ఎట్లా ఎదుర్కోవాలో నాకు తెలుసు. మీరు ఎట్లా ఎదుర్కొంటారో నాకు తెలియదు. మొట్టమొదటగా, జీవితం అంటే ఏమిటి? ఎక్కడ చూసినా దుఃఖం, మితిమీరిన జనాభా, ఆప్రయోజకులైన రాజకీయవేత్తలు, రకరకాల మాయలూ, మోసాలూ, చిత్తశుద్దిలేక పోవడం, లంచగొండితనం వంటివి నిరాఘాటంగా సాగుతున్న ప్రపంచంలో మన అస్తిత్వం అన్నది ఏమిటి? ఇదంతా ఎట్లా ఎదుర్కోవాలి? అందుకు మొదట తప్పనిసరిగా తరచి చూడవలసినది జీవించడం అంటే అర్థం ఏమిటనేది. ప్రస్తుతం వున్న ప్రపంచంలో జీవించడం అంటే ఏమిటి? మన నిత్య జీవితాన్ని అసలు ఎట్లా గడపాలి, సిద్ధాంతరూపేణా కాదు, తాత్త్విక యోచనగా కాదు, ఆదర్శవాదం కాదు, అసలు వాస్తవంలో మన నిత్య జీవితాన్ని ఎట్లా జీవించాలి?
మనం కనుక పరీక్షిస్తే, బాగా గాఢమైనస్పృహతో గమనిస్తే, అది ఒక నిరంతరమైన సమరం, నిరంతరమైన పోరాటం, ప్రయాస మీద ప్రయాస పడుతూ వుండటం. ఉదయం నిద్రలేవడం ఒక ప్రయాస. ఏం చేయాలి మనం? తప్పించుకొని పారిపోవడం సాధ్యం కాదు. ఈ ప్రపంచంలో జీవించడం అసాధ్యం అని అనుకున్న చాలామంది, అన్నింటినీ వదిలేసి ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళిపోయి, అంతర్థానమయ్యారు.