పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

కృష్ణమూర్తి తత్వం

దాంట్లో నమ్మకం వుంటుంది. ఈ రెంటి మధ్యన ఏం భేదం వుంది? వీరిద్దరిలో ఏ మాత్రం వ్యత్యాసం లేదు. ఎందుకంటే మీరు నమ్మటంలో శిక్షణ పొందారు; అతనికి నమ్మకుండా వుండటంలో తర్ఫీదు యిచ్చారు. కాబట్టి నిజంగా తరచి శోధించాలను కునేవారు ఆ పద్ధతులన్నీ సంపూర్ణంగా తిరస్కరించాలి. తిరస్కరించి తీరద్దూ? ఇందులోని ప్రాధాన్యతనంతా అర్ధంచేసుకున్నారు కాబట్టి తిరస్కరించాలి. భద్రతాలేమి వల్ల, భయపడుతుండటం వల్ల, అంతర్గతమైన వెలితి వల్ల ఒక దేశంతోనో, ఒక సిద్ధాంతవాదంతోనో, దేవుని మీద విశ్వాసంతోనో మనం పూర్తిగా ఐక్యమై పోతాం. దీనివల్ల ఏం జరుగుతున్నదో ప్రపంచమంతటా కనిపిస్తూనే వుంది. మతాలన్నీ ప్రేమనీ, సహోదరభావాన్నీ, యింకా అటువంటివాటినీ ఒక ప్రక్కన ప్రవచిస్తూనే మనిషిని మనిషినుండి విడదీస్తున్నాయి. మీరు సిక్కులు, నేను హిందువుని, అతడు ముస్లిం, మరొకరు బౌద్ధులు. ఈ గందరగోళం, యీ విభజనలు, యివన్నీ చూసినప్పుడు మరో కొత్త రకమైన ఆలోచనా సరళి వుండితీరాలని మనం గ్రహిస్తాం. అయితే మనం హిందువులగానో, క్రైస్తవులుగానో, యింకా రకరకాలుగానో వుండి పోయినంతవరకు కొత్త రకంగా ఆలోచించడమన్నది జరగదు అని స్పష్టంగా కనబడుతూ వున్నది. దీనంతటినుండి విముక్త మవాలంటే మిమ్మల్ని, మీ అస్తిత్వం యొక్క మొత్తం స్వరూపాన్ని మీరు తెలుసుకొని తీరాలి. ఎందుకు అంగీకరిస్తుంటారో, ఎందుకు ఆధిపత్యాన్ని అనుసరిస్తారో గ్రహించి తీరాలి. అదంతా మీరు చాలా స్పష్టంగా చూడాలి. మీకు గెలుపు కావాలి; కష్టాలు మీదపడ్డప్పుడు ఆధారపడటానికి దేవుడంటూ ఒకడున్నాడని ఎవరయినా మీకు హామీ యివ్వాలి. నిజంగానే ఆనందంగా, సంతోషంగా వున్న వారు ఎవ్వరూ దేవుడిని గురించీ తలుచుకోనే తలుచుకోరు. బాధల్లో, సంఘర్షణలో వున్నప్పుడే దేవుడిని తలచుకుంటాం. అయితే యీ బాధల్నీ, సంఘర్షణనీ తయారు చేసుకున్నదీ మనమే. ఈ ప్రక్రియనంతా అవగాహన చేసుకోనంతవరకు వూరికే దేవుడిని గురించి అన్వేషించడం నిస్సందేహంగా భ్రాంతిలో పడవేస్తుంది.

కాబట్టి నేను మాట్లాడుతున్న మతపరమైన విప్లవం అంటే ఏదో ఒక మతాన్ని పునరుద్ధరించడమో, సంస్కరించడమే కాదు. అది సర్వమతాల నుండి, సమస్తమైన సిద్దాంతవాదాల నుండి సంపూర్ణమైన విముక్తి. అంటే నిజమైన అర్ధం ఏమిటంటే వీటిని తయారుచేసిన సమాజం నుండి విముక్తి. ఆకాంక్షా పరత్వం వున్న మనిషి మతచింతనా పరుడు అవలేడు. ఆకాంక్షాపరత్వం వున్న మనిషికి ప్రేమ అంటే తెలియదు. అతను ప్రేమను గురించి మాట్లాడవచ్చుగాక. ఒకరు లౌకిక దృష్టిలో ఆకాంక్షాపరులు కాకపోవచ్చు. అయితే తాము మహాత్ముడినవాలనో, ఆధ్యాత్మిక రంగంలో