Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సందేహాలూ, సమాధానాలు

ప్రశ్న : మానవుడి సమస్యలు పరిష్కరించాలంటే రావలసినది ఆర్థిక విప్లవం కానీ, సామాజిక విప్లవం కానీ కాదు; కావలసినది మత విషయకమైన విప్లవం అని మీ ప్రసంగంలో అన్నారని యీ రోజు వార్తాపత్రికలో చదివాను. మతవిషయకమైన విప్లవం అంటే మీ అర్థం ఏమిటి?

కృష్ణమూర్తి : మొట్ట మొదట అసలు మతం అంటే మనం ఏమనుకుంటున్నామో చూద్దాం. మనలో చాలామందికి అసలు మతం అంటే ఏమిటి? మతం అంటే ఫలానా అని చెప్పే ఒక సిద్ధాంతంగా కాదు, అసలు వాస్తవంలో ఏమిటి? చాలామంది దృష్టిలో సర్వసాధారణంగా మతం అంటే కొన్ని కొన్ని మూఢ విశ్వాసాలూ, ఆచారాలు, వుపనిషత్తుల్లో, గీతలో, బైబిల్లో ఏం చెప్పారూ అనేవి. లేదా నిబద్దీకరణం చెందిన మన మనసుల్లోనుంచి, హిందువులుగానో, క్రైస్తవులుగానో, కమ్యునిస్టు ధోరణిలోనో రూపుదిద్దుకున్న మన మనసుల్లో నుంచి పుట్టుకొచ్చిన అనుభవాలతో, అలౌకికమైన స్వప్నాలతో, ఆశలతో, వూహలతో తయారు చేసినదాన్ని మతం అని అనుకుంటాం. ఒక రకమైన నిబద్దీకరణంతో ఆరంభమైన మనం, దానికనుగుణంగా వుండే అనుభవాలనే పొందుతూ వుంటాం. మతం అని మనం పిలుస్తున్నదంతా ఏమిటంటే ప్రార్థనలు, కర్మకాండలు, అంధ విశ్వాసాలు, దేవుడిని ప్రత్యక్షం చేసుకోవాలనుకోవడం, ఆధిపత్యానికి తలవంచడం, అసంఖ్యాకమైన మూఢాచారాలు- ఆంతే కదూ! అదేనా మతం అంటే? నిజంగా సత్యం ఏమిటి అన్నది తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నవారు అసలు యిదంతా పూర్తిగా విసర్జించి పారేయాలి, వదిలేయవద్దూ? గురువుల ఆధిపత్యాన్ని, వుపనిషత్తుల ఆధిపత్యాన్ని, తన స్వీయ అనుభవాల ఆధిపత్యాన్ని అన్నింటినీ పూర్తిగా వదిలివేయాలి. ఆ విధంగా ఆధిపత్యమంతా తొలగించుకొని ప్రక్షాళితం అయింది కాబట్టి మనసు కొత్తదానిని ఆవిష్కరించుకోగలుగుతుంది. అంటే అర్థం మీరు హిందువుగానో, క్రైస్తవునిగానో, బౌద్ధునిగానో వుండటం మానేస్తారు. అటువంటి వ్యవహారంలో వుండే బుద్దిహీనతను గ్రహించి దానినుండి మీరు బయటపడాలి. అది మీరు చేస్తారా? ఎందుకంటే అట్లా చేస్తే ప్రస్తుత సమాజాన్ని మీరు ధిక్కరించినట్లవుతుంది, మీ వుద్యోగం వూడచ్చు. కాబట్టి భయం మీ మనసుమీద పెత్తనం, వహిస్తుంది; అందుకని మీరు ఆధిపత్యానికి తలవంచుతూనే వుంటారు.

మతం అని మనం యిప్పుడు అంటున్నది మతం కానే కాదు. దేవుడంటే మనకు నమ్మకం వున్నదా, నమ్మకం లేదా అన్నది మన నిబద్దీకరణం మీద ఆధారపడి వుంటుంది. మీకు దేవుడంటే నమ్మకం వుంటుంది, కమ్యునిస్టుకి దేవుడు లేడు అనే