Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

కృష్ణమూర్తి తత్వం

అంతులేకుండా మాట్లాడండి అవన్నీ బాధలకే దారితీస్తాయి. ఇక యిప్పుడు అంతా మీ చేతుల్లోనే వుంది. నాయకులు లేరు, గురువులు లేరు; మీరు ఏం చేయాలో చెప్పడానికి ఎవరూ లేరు. మీకు మీరే వెలుగును చూపించుకునే దీపం కావాలి. కాబట్టి, మీరు వొంటరిగా వున్నారు. మతిభ్రష్టం పొందిన, దౌర్జన్య పూరితమైన యీ ప్రపంచంలో మీరు వొంటరిగా వున్నారు. అందుకనే యీ సిద్ధాంతాల ఎడారిలో మీరు ఒక ఒయాసిస్ అవాలి. ఈ ఒయాసిస్ ప్రేమ వున్నప్పుడే ప్రాణం పోసుకుంటుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, XVII వాల్యూమ్,

నాల్గవ ప్రసంగం, బొంబాయి, 1967