ప్రసంగాలు
63
స్వర్గసుఖాన్నీ, క్షణికమైన ఆనందాన్నీ యిచ్చే సాధనాలు. ఆ రకంగా దానిని పొందడం సాధ్యంకాని విషయం.
కాబట్టి ప్రేమ, సౌందర్యం లేనప్పుడు సత్యం వుండదు. మీ మహాత్ములు, మీ దేవుళ్ళు, మీ మతాచార్యులు, మీ గ్రంధాలు యిది వొప్పుకోరు. అందువల్లే మీరింత దుఃఖావస్థలో వున్నారు. ప్రేమను గురించి కంటే గీత గురించో, ఖురాన్ గురించో, బైబిల్ గురించో మీరు మాట్లాడాలనుకుంటారు. దీనికి అర్ధం ఏమిటంటే మురికి వీధులని, పరమ ఛండాలాన్ని, దారి పొడుగున వున్న రోతనీ చూసి కూడా మీరు సహిస్తూ వుంటారు. మురికికి మీ సహకారం అందిస్తారు. ఎప్పుడు సహకరించకుండా వుండాలో మీకు తెలియదు. ఈ వ్యవస్థకు మీ సహకారం అందిస్తారు. “లేదు, నేను సహకరించను, ఏది ఏమయినా సరే నేను లెక్క చేయను” అని ఎప్పుడనాలో మీకు తెలియదు. ఆ మాట మీరు అన్నారంటే మీలో ప్రేమ పుండబట్టి, మీలో సౌందర్యం వుండబట్టి. మీరు తిరగబడటం కాదు దానికి కారణం. అప్పుడు మీకు తెలుస్తుంది, మీలో యిది వున్నప్పుడు సౌందర్యం, ప్రేమ వుంటాయని. అప్పుడు 'వున్నది ఏది' అన్న పరిగ్రాహ్యత వుంటుంది. అదే ప్రేమ, అప్పుడు మనసు అప్రమేయంగా (కొలతల్లో చూపలేనంతగా) తనని మించి ఆవలగా పోగలుగుతుంది.
కాని, మీకు పనులు వున్నాయి. ప్రతి రోజూ ఆఫీసుకి వెళ్ళినప్పుడు ఒక తుఫానులాగా పని చేసి తీరాలి. కష్టపడాలి. కాని యిది ప్రేమని సాధించడం లేదు. ఎందుకంటే వినయాన్ని ఎట్లా సంపాదించలేరో అట్లాగే ప్రేమను కూడా సాధించి అందుకోలేరు. గర్విష్టి మనిషే మాటల్లో వినయాన్ని సాధిస్తాడు. అయితే అతను గర్విష్టిగానే మిగిలిపోతాడు. వినయం లాగే ప్రేమనీ కూడా అలవర్చుకోలేము. సౌందర్యాన్నీ అలవర్చుకోలేము. ఎరుకగా లేకుండా సత్యాన్ని చూడటం సాధ్యం కాదు. మీరు ఎరుకగా వుంటే- ఏదో నిగూఢ తత్వం గురించి కాకుండా మీరు చేస్తున్న దానిని గురించి, మీరు ఎట్లా అగుపిస్తారు, ఎట్లా నడుస్తారు, ఎట్లాతింటారు, దేనిని గురించి మాట్లాడతారు అనే ఎరుక వుంటే, అప్పుడు ఆ ఎరుక ద్వారా సుఖం యొక్క, కోరిక యొక్క, దుఃఖం యొక్క స్వభావలక్షణం, మనిషిలో వున్న విపరీతమైన వొంటరితనమూ, ఏమీ తోచకపోవడమూ గ్రహించడం మొదలు పెడతారు. అప్పుడు 'స్థలం' అని మనం అంటున్నదానిని చూడటం ఆరంభిస్తారు. ఎక్కడయితే మీకు మీరు చూస్తున్న వస్తువుకు మధ్యన ఎడం వుంటుందో అక్కడ ప్రేమ లేదని మీరు గ్రహిస్తారు.
ప్రేమ లేనప్పుడు మీరు ఏం చేసినా సరే- సంస్కరణలు చేయండి, ఒక కొత్త సాంఘిక క్రమాన్ని తీసుకొని రండి, సైద్ధాంతికమైన అభ్యుదయాన్ని గురించి