పుట:కుమారసంభవము.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

55


క.

ఆనాకంబున గలయ, మ్మానిను లందఱును నీకు మన మిడి యున్నం
దాని సహింపక సురవిభుఁ, డీనెపమునఁ జంపఁ లఁచి యీపనిఁ బంచెన్.

419


క.

నినుఁ జూచినకన్నుల సుర, వనితలు దనుఁ జూడకున్న వాసవుఁ డలుకం
జలి చా నిన్ బంచినఁ జాఁ, జనునే యాతనిచలం బసాధ్యము గాఁగన్.

420


చ.

త్రిదశులు పిల్చి [1]పంపు డొకతేజముగాఁ గొని దేవదేవు నె
ల్లిదముగఁ జెప్పి యింతగొని లేవడి లేచెదు ప్రాణగొడ్డ మా
డెదు మది నోటకండ సెడి డెప్పరికంబులు సేసె దిట్టిక్రొ
వ్విదములు దక్కు మీపలుకు విష్ణుఁడు లక్ష్మియు విన్న మెత్తురే.

421


గీ.

హరుఁడు నెప మల్గి చూచుడు నాక్షణంబ, యఖిలజగములు సంహార మగురయమున
నట్టియుగ్రుపై నటే వోయే దకట లగ్గ, [2]మేలుమే లెంతమీ లెంతిమీలఁ ద్రాగు.

422


క.

కనుకిట్టిన నిట్టిక నమ, లినవిధమున దేవతావలికిఁ బూనితి నే
నని రుద్రున కుఱక పైఁజని, చెనయుట శిఖిశిఖుల మిడుద సెనయుట గాదే.

423


వ.

అని పరమేశ్వరు నెఱింగించుచున్నరతిం గనుంగొని.

424


ఉ.

ఏ నలరమ్ము లొడ్డఁ బరమేశ్వరుచిత్తము గౌరిచిత్తముం
దాన కరంగి కూడ మఱి దానికి సందియ మేల వెండియు
బూనెద మూఁడులోకములఁ బుట్టనిపూనికి వారిమేనులు
న్మానుగఁ గూర్తు నొక్కటిగ మార్గణకౌశలభావ మేర్పడన్.

425


గీ.

జగము లెల్లను నాయాజ్ఞ మిగుల కునికిఁ, గనియు వినియు నెఱుంగుదు వనజనేత్ర
యింతభయమునఁ బొంద నీ కేల మది భు, జంగభూషణు నబ్బూటగొంగఁజేసి.

426
  1. పంపుడు= పంపుట
  2. మీలనుమీలు ద్రాగువనుటకు:
    “మండలనాథు నాజ్ఞకు సమస్తజనంబులు నోడిపాడిమై | నుండక మేరతప్పి బలియుండ బలున్ మననీక పెద్దమీన్ కొండికమీనుద్రాక్రియ గ్రొవ్వునఁ జంపుచునున్న వ్రేఁకమ | మ్మండల మేలియుండ మతిమంతులకుం బరపక్ష భైరవా" అని భద్రభూపాలుని నీతిశాస్త్రముక్తావళి.
    మఱియు “తగరు కొండమీఁదఁ దాఁకగోరి నాదారి | నెదిరి తన్ను దెలియ కింత పలికె | నెంతమీను వచ్చి యెంతమీను మ్రింగె" రాధికాసాంత్వనము.