పుట:కుమారసంభవము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

కుమారసంభవము


క.

పతిఁ జూచి రతి నిజాంత, ర్గతఖేదం బెలమి మఱపుగా నిడి కాలో
చితవచనాంతరముల సుర, పతి గడువెస నిన్ను నేమిపని రాఁ బనిచెన్.

413


వ.

అని [1]తఱమియడుగు చున్నరతి ముఖవికారంబు గని మనసిజుండు మనంబునం
గుసురుకొనుచుఁ జిఱునవ్వు నవ్వుచు నిట్లనియె.

414


చ.

బెదరుచు నంతరంగమున భీతికిఁ గండవడంబు సుట్టి ప
ల్కెదు పొరపొచ్చెమున్ వెఱవుఁ గేనముఁ జెయ్వుల కోలి నెత్తువె
ట్టెదు వడి మోవియుం గరువటిల్లెడు నీమది నింతదల్లడం
[2]బొదవుడి దేమిగారణమ యుగ్మలి నా కెఱిఁగింపు మేర్పడన్.

415


వ.

అనిన దివ్యాంతరిక్షభౌమాంగికాద్యనేకదుర్ణిమిత్తంబులు నిర్ణిమిత్తంబ వుట్టు
టెఱింగించి దీనానన యగుచు నీపోయివచ్చినకార్యం బెఱింగింపు మనినం బెద్దయు
విశేషంబులే దయ్యుమామహేశ్వరులతపోభంగంబు సేయు మనిన దానికి మెయి
కొని వచ్చితి ననిన విని రతి యుదరిపడి యుల్లంబునం దల్లడిల్లుచు.

416


సీ.

మనకులదైవ మన్ మన్నన లేదేని ద్రిభువనారాధ్యుఁ డన్ తెంక లేక
పరమయోగాత్ముఁ డన్ భక్తి లేదేనియు సర్వేశ్వరుం డనుశంక లేక
యజశిరోదళనుఁ [3]డన్నదరు లేదేనియుఁ గాలారి యనునోటికండ లేక
విషమాంబకుం డనువెఱపు లేదేనియుఁ బ్రళయాగ్నిరుద్రుఁ డన్ భయము లేక
పంచె నట్టియుగ్రుపై నిన్ను నదిమీఁదఁ, బోయి తనకు లగ్గఁబోయి లగ్గ
వచ్చునే [4]ప్రధానవైరాన మరణంబు, ధ్రువ మనంగ వినఁడె దివిజవిభుఁడు.

417


చ.

విడపక పంచె నాకఁ డొకయేలినవాఁ డని పూన్కికాఁడవై
పొడువఁగఁ బోయె దీవు నొకపోటరిమూఁటవ నీకు నక్కడన్
మృడుఁ డొకయెల్లిదుం డకట మెచ్చక సింగపువేఁట లాడఁగాఁ
గడఁగెద రిట్ల యైనఁ దుది గా కెడ నింద్రుఁడు నీవు దక్కుటే.

418
  1. తఱిమి= నిర్బంధించి "కీడు గాంచి..... నొండెండ్లు లేదని | తఱిమి యడుగుటయును వెఱవు వాసి" నిర్వ-ఆ-8
    "ఇత్తెఱంగున నూఱార్చి యింతిఁదఱమి | యల్లనల్లన దోకొని" నిర్వ-ఆ-9
  2. ఒదవుడు = ఒదవుట
  3. ఇట్టి సంధికి :- "అన్నిష్టసఖియూదియున్నదాని” భార. ఆది.
  4. "వైరేణ మరణం ధ్రువమ్మనంగ దివిజవరుడు వినఁడె." అనునది పాఠాంతరము.