పుట:కాశీమజిలీకథలు -04.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

310

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

అప్పుడా రాజపుత్రిక విస్మయ రసావేశహృదయయై అయ్యో నా బుద్ధి యింత మొద్దువోయినదేమి ? వీని యెత్తులే నాకుఁ దెలియకున్నవి యాలోచించినట్లే కనంబడఁడు. తనయాటఁ గాచుకొనుచున్నట్లు తోచదు. అన్నన్నా ! యెరలువైచి రాజునకు జంతువుల దూరము జేసి తృటిలో నాటగట్టివై చెనే ? ఆహా ! యింతనేర్పరిని నేను జూచి యెఱుఁగనని యక్కజమందుచు వెండియు రెండవయాట ప్రారంభించి తన బుద్ధియంతయు వ్యాపకము జేసి యాడినదికాని యదియు నాతండశ్రమముననే త్రోసి రాజు చేసెను.

అప్పుడా చిన్నది చిన్నవోయి మూఁడవయాటకు బలము సవరింపుచున్న సమయంబున నతండు నవ్వుచు బోటీ ? నీ యాటపాటవము దెలిసినది. ఈ సారి మంత్రిఁదీసి నిన్నుఁ ద్రోసి రాజుఁజేసెదఁ జూడుము. అట్లు చేయకపోతినేని నీయాట లన్నియు నోడినట్లు సమ్మతించెదనని మూఁడవయాట ప్రారంభించెను. అప్పుడప్పుడఁతి తన జంతువులన్ని యుం జంపుకొన్న కాని యతండు చెప్పిన గదిలోని బంటుం జంప లేక పోయినది. అతం డాబంటుచేతనే త్రోసిరాజుచేసి పన్నిదము గెలిచితినని కేకలు వైచెను. ఆపై దలి లజ్ఞావిషేదమేదుర హృదయయై తలవంచుకొని యొక్కింతసే పూరకొని ఓహో ! నీ కృషియంతయు నీ యాటలోనే చేయంబడినట్లు కనఁబడు చున్నది. విద్యలలో నిటువంటి ప్రవేశము గలిగిన లెస్సయంగుగాదాయని పలికిన విని యతండిట్ల నియె. పడఁతీ ! నీవే విద్యలలోనైన నాతో బ్రసంగించి గెలుపుకొంటివేని నేను జదరంగములో నోడినట్లే యెంచుకొనియెద. నడుగవచ్చునని యుత్తర మిచ్చుటయు నమ్మచ్చెకంటి తాను జదివికొనిన విద్యలలోఁ గొన్ని శంకలు చేసినది

తత్ప్రశ్నముల కతండవలీలగా నుత్తరము జెప్పి నాలుగువేదములలో నాఱు శాస్త్రములలోఁ దనకుఁగల పాండిత్యమంతయుం దెల్ల మగునట్లుపన్యసించి యా చంచ లాక్షికి వాగ్భంధము గావించెను. కౌముది కళావంతుని రూపమునకు విద్యకు మిక్కిలి యాశ్చర్యమందుచు నతండు తన్నె త్తిపొడిచిన మాటలు హృదయశూలములై బాధింప సఖీ ! యీ పాఱుఁడు మాటలు పెక్కు నేర్చియున్నాడు తక్కిన పాండిత్యమువెనుక విమర్శింతుగాక. ఈ పందెము గెలిచినందులకుఁ బారితోషికము పంపుదుమని చెప్పుమని పలుకుచు లేచి లోపలికిం బోయినది.

అప్పుడు కళావంతుఁడంగ జానలు మార్గమెరింగింపఁ గొల్వు కూటమునకు వచ్చి యందున్న సదాచారితోఁ గౌముది గెలిచితినని చెప్పెను. ఆ మాటవిని యతండు గంతులు వైచుచు వానిం గౌఁగిలించుకొని తండ్రీ ! నీ కతంబున నా కులంబు వన్నె కెక్కినది. నేను ధన్యుండ నైతినని స్తోత్రములు చేయఁదొడంగెను. అందున్న అధికారులును వాని విద్యాపాటవము విని యబ్బురమందఁజొచ్చిరి. పిమ్మట సదాచారి కళావంతునితోఁ గూడనధికారుల యనుజ్ఞ గై కొని సత్రమునకు వచ్చెను.

అప్పుడు అందున్న బ్రాహ్మణులెల్లరు మూగికొని యొహో ! వీని ప్రాయ